Movie News

ఆర్ఆర్ఆర్ సంక్రాంతికే.. కండిషన్స్ అప్లై

‘బాహుబలి’ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఇప్పటికే రెండుసార్లు మార్చారు. మూడోసారి కూడా మార్చక తప్పని పరిస్థితి నెలకొంది.

2020 జులై 30.. 2021 జనవరి 8 డేట్లను అది తప్పిపోగా.. అక్టోబరు 13 నుంచి కూడా సినిమాను వాయిదా వేయడం లాంఛనమే అని భావిస్తున్నారు. ఐతే తాజా వాయిదా గురించి ఇంకా అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది. త్వరలోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి చిత్ర బృందం ఈ విషయాన్ని వెల్లడిస్తుందని.. అలాగే కొత్త రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటిస్తుందని అంటున్నారు. ఐతే ఆ కొత్త డేట్ ఏదన్నదే తెలియడం లేదు.

కొన్ని రోజుల ముందు వరకు ఉన్న అంచనా అయితే 2022 వేసవికి ‘ఆర్ఆర్ఆర్’ రావచ్చని. కానీ రెండు మూడు రోజులుగా వస్తున్న వార్తలు వేరు. ఈ చిత్రం సంక్రాంతి రేసులో నిలుస్తుందని అంటున్నారు. ఐతే ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతికి వస్తుందన్న సంకేతాలేమీ లేకపోవడంతో కొన్ని వారాల కిందట ఒకటికి మూడు భారీ చిత్రాలు సంక్రాంతి బెర్తులు బుక్ చేసుకున్నాయి. జనవరి 12 నుంచి వరుసగా మూడు రోజుల్లో భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్ విడుదల కావాల్సి ఉంది.

మరి ఆ మూడు చిత్రాలు రేసులో ఉండగా ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతికి ఎలా వస్తుందన్నది అర్థం కాని విషయం. ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతికి వచ్చేట్లయితే ఆ మూడు చిత్రాలనూ వాయిదా వేయక తప్పదు. ఐతే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉందని తెలుస్తోంది. సరిగ్గా సంక్రాంతికి కాకుండా వారం ముందు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని చిత్ర బృందం ఆలోచిస్తోందట.

ఈ ఏడాది జనవరి 8న రిలీజ్ చేయాలనుకున్నట్లుగానే.. వచ్చే ఏడాది జనవరి తొలి వారం చివర్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని చూస్తున్నారట. వేసవి అయితే మరీ ఆలస్యం అవుతుందని.. అప్పుడు కూడా ‘కేజీఎఫ్’ సహా వేరే చిత్రాలకు ఆల్రెడీ డేట్లు ఖరారైన నేపథ్యంలో వాటిని డిస్టర్బ్ చేయడం ఎందుకుని.. సంక్రాంతికి వారం ముందు వస్తే ఆ వారం రోజులు వసూళ్ల మోత మోగించుకుని.. రెండో వారం సంక్రాంతి అడ్వాంటేజీని ఉపయోగించుకోవచ్చని.. కొత్త చిత్రాలకు దాని వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదని అంచనా వేస్తున్నారట. మరి త్వరలో జరగనున్న ప్రెస్ మీట్లో ఏం ప్రకటన చేస్తారో చూడాలి.

This post was last modified on August 30, 2021 5:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

3 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

5 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

5 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

6 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

7 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

9 hours ago