బాలీవుడ్ బాధ రోజు రోజుకూ పెరిగిపోతోంది. హిందీ చిత్రాల భవిష్యత్ పట్ల ఆందోళన అంతకంతకూ ఎక్కువవుతోంది. కరోనా ఫస్ట్ వేవ్ కొట్టిన దెబ్బకు బాలీవుడ్ మామూలుగా దెబ్బ తినలేదు. ఏడాదికి పైగా థియేటర్ల నుంచి అసలు రెవెన్యూ అన్నదే లేకపోయింది. సెకండ్ వేవ్ తర్వాత అయినా పరిస్థితులు మారతాయేమో అనుకుంటే అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. ఈ మధ్యనే అక్షయ్ కుమార్ సినిమా ‘బెల్ బాటమ్’ మూవీని భారీ స్థాయిలో విడుదల చేశారు.
కానీ ఆ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవం ఎదురైంది. అక్షయ్ సినిమాలకు మామూలుగా తొలి రోజు వచ్చే వసూళ్లు కూడా ఈ చిత్రానికి ఫుల్ రన్లో రాని పరిస్థితి. ఆ రిజల్ట్ చూసి బాలీవుడ్ రివైవల్ ఆశలు ఒక్కసారిగా కూలిపోయాయి. ‘బెల్ బాటమ్’కు సానుకూల ఫలితం వస్తే మరిన్ని చిత్రాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు కానీ.. దానికి నెగెటివ్ రెస్పాన్స్ రావడంతో అందులో చాలా మంది వెనక్కి తగ్గారు.
ఐతే ఈ పరిస్థితుల్లోనూ ధైర్యం చేసి ‘చెహ్రె’ చిత్రాన్ని రిలీజ్ చేశారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రలు పోషించిన థ్రిల్లర్ మూవీ ఇది. కామెడీ చిత్రాలకు పేరుపడ్డ రుమీ జాఫ్రీ తన శైలికి భిన్నంగా థ్రిల్లర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. 3 ప్లస్ రేటింగ్సే ఇచ్చారు సమీక్షకులందరూ. 3.5-4 రేటింగ్స్ కూడా పడ్డాయి. స్క్రిప్టు గురించి.. ఆర్టిస్టుల పెర్ఫామెన్స్‌ల గురించి సినిమా చూసిన వాళ్లందరూ గొప్పగా మాట్లాడుతున్నారు.
ఐతే ఇంత పాజిటివ్ రివ్యూలు, ఫీడ్ బ్యాక్ వచ్చినా.. అది బాక్సాఫీస్ రిజల్ట్‌లో ప్రతిఫలించడం లేదు. తొలి రోజు దేశ వ్యాప్తంగా కేవలం రూ.50 లక్షల వసూళ్లు వచ్చాయంటే ఈ సినిమా పరిస్థితి ఏంటో అంచనా వేయొచ్చు. అమితాబ్ లాంటి నటుడి సినిమాకు ఇది పరాభవం అనే చెప్పాలి. వారాంతంలో కూడా వసూళ్లు పెద్దగా పుంజుకోలేదు. హిందీ ప్రేక్షకులు ఇంకా థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే మూడ్‌లోకి రాలేదని ఈ చిత్రంతో మరోసారి రుజువైంది. దీంతో ఇప్పుడిప్పుడే మళ్లీ పేరున్న సినిమాలను రిలీజ్ చేసే సాహసం బాలీవుడ్ నిర్మాతలు చేయరేమో.
This post was last modified on August 30, 2021 8:27 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…