గత దశాబ్ద కాలంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యుత్తమ నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు ఫాహద్ ఫాజిల్. మలయాళ సినిమాలు చూసేవారికి అతనెంత గొప్ప నటుడో బాగా అర్థమవుతుంది. గత కొన్నేళ్లలో ఓటీటీల విప్లవం కారణంగా వివిధ భాషల వాళ్లు మలయాళ సినిమాలను విపరీతంగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఫాహద్ ప్రతిభ గురించి అందరికీ తెలిసింది. కుంబలంగి నైట్స్, ట్రాన్స్, జోజి, మాలిక్ లాంటి చిత్రాల్లో ఫాహద్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇప్పటికే తమిళంలోనూ సినిమాలు చేసి సత్తా చాటుకున్న ఫాహద్.. ఇప్పుడు తెలుగులోకి కూడా అడుగు పెడుతున్నాడు. ఇక్కడ అతడి అరంగేట్ర మూవీనే అల్లు అర్జున్ లాంటి సూపర్ స్టార్, సుకుమార్ లాంటి టాప్ డైరెక్టర్‌తో కావడం అందరినీ ఎగ్జైట్ చేస్తోంది. ‘పుష్ప’లో అతనే విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ రోజే ఫాహద్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారీ చిత్రం నుంచి.
షెకావత్ అనే నార్త్ ఐపీఎస్ ఆఫీసర్‌గా ఫాహద్ కనిపించనున్నాడీ చిత్రంలో. ఫస్ట్ లుక్‌లో ఫాహద్ గుండుతో కనిపించడం విశేషం. తెలుగులో చేస్తున్న తొలి సినిమాలోనే గుండుతో కనిపించే సాహసం చేయడం ఫాహద్‌కే చెల్లింది. పాత్రల కోసం గుండు చేయించుకునేవాళ్లు అరుదుగా ఉంటారు. ఫాహద్ కమిట్మెంట్‌కు ఇది నిదర్శనం అంటూ అతణ్ని పొగిడేస్తున్నారు నెటిజన్లు.
ఐతే ఫాహద్ అవసరమైతే గుండు చేయించుకునే రకమే కానీ.. ‘పుష్ప’ కోసం అతను ఆ సాహసం చేయలేదు. ప్రోస్థెటిక్ మేకప్ ద్వారా ఫాహద్‌ను గుండు లుక్‌లోకి తీసుకొచ్చారు. నిజం గుండే అనిపించేలా భ్రమ కల్పించారు. ఫాహద్‌కు వేరే కమిట్మెంట్లు చాలా ఉండటంతో గుండు కొట్టించుకోవడానికి ఇబ్బంది అయింది. దీంతో మేకప్ ద్వారా మేనేజ్ చేయడానికి సుక్కు ఓకే అన్నాడు. ఐతే ఫాహద్ ప్రతిభ గురించి తెలిసిన వాళ్లు సినిమాలో అతడి లుక్‌ను మించి అతడి హావభావాలు హైలైట్ అవుతాయని ఆశిస్తున్నారు.
This post was last modified on August 29, 2021 11:18 am
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారెంటీలలొ ఇప్పటి వరకు కొన్ని మాత్రమే అమలు చేసింది.…
ఒక్కోసారి ఎంత హిట్టు కొట్టినా ఆశించినంత పేరు రాకపోవడం నటీనటుల విషయంలో జరుగుతుందేమో కానీ దర్శకులకు అరుదు. కానీ సుందర్…
కడపలో ఎం జరిగినా సంచలనమే అవుతోంది. ఈ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా…
పుష్ప-2 సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హిందీలో అన్ని బాక్సాఫీస్ రికార్డులనూ ఈ…
మలయాళం సినిమాలు ఈ మధ్య కాలంలో కంటెంట్ ఆధారంగా వచ్చి భాషతో సంబంధం లేకుండా కొన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే…
ఎప్పటినుంచో అభిమానులు కోరుకుంటున్న కాంబినేషన్ నిజంగా జరిగితే దానికొచ్చే కిక్కు మాములుగా ఉండదు. అందుకే మల్టీస్టారర్లు మనకు అరుదైపోయాయి. రజనీకాంత్…