రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యూహం ఎలా ఉంది? వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ ఎన్ని స్థానాల్లో అధికారంలోకి వస్తుంది? ఎన్ని స్థానాల్లో విజయం దక్కించుకుంటుంది? కీలక నేతలు ఎవరు గెలుస్తారు? మళ్లీ టీడీపీకి ఊపు వస్తుందా? ఇదీ.. ఇటీవల కాలంలో తరచుగా తెరమీదికి వస్తున్న చర్చ. అయితే.. దీనికి సంబంధించి.. ఇటీవల వైసీపీ నాయకుడు, మంత్రి, డిప్యూటీ సీఎం కే. నారాయణ స్వామి ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. టీడీపీ ఎలాంటి పొత్తులూ.. లేకుండా పోటీ చేసి.. కనీసం 2 స్థానాల్లో విజయం దక్కించు కుంటే.. తాను చంద్రబాబు ఇంట్లో పాకీ పనిచేస్తానని సవాల్ విసిరారు.
అయితే.. ఈ వ్యాఖ్యలపై టీడీపీకి చెందిన ఎస్సీ నాయకులు, ఇదే సామాజిక వర్గానికి చెందిన ఎస్సీ మం త్రులు కొన్ని వ్యాఖ్యలు చేసినా.. నారాయణ స్వామి చెప్పిన లెక్క ప్రకారం.. తమకు ఎన్ని సీట్లు దక్కుతా యనే విషయంపై మాత్రం నోరు విప్పలేదు. అయితే.. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎన్నిస్థానాల్లో విజయం దక్కించు కుంటుందో .. ఆయన జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికలు ఎప్పుడు.. జరిగినా.. తమదే గెలుపని చెప్పిన అచ్చెన్న ఏకంగా.. టీడీపీ 155 స్థానాల్లో విజయం దక్కించుకుని.. చంద్రబాబు సీఎం అవుతారని.. చెప్పుకొచ్చారు.
తాజాగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన నిరసన కార్యక్రమంలో అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెక్కలి నియోజకవర్గం కొత్త పేట నుండి కోట బొమ్మా ళి రైతు బజార్ సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘‘155 స్థానాలలో చంద్రబాబు అధికారంలోకి రానున్నా రు.. నేను అధికారంలోకి వస్తే కొంత మంది పెద్దలను పలకరించే వారు ఉండరు’’ అంటూ అచ్చెన్నా యుడు హెచ్చరించారు. అంటే.. ఆయన జోస్యం ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ వైసీపీని మించిపోతుం డడం ఖాయమనే సూచనలు కనిపిస్తున్నాయి.
కానీ, ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే.. అచ్చన్న వ్యాఖ్యలు నిజమెంత? అనేది సందేహమే. ఎందుకంటే.. చంద్రబా బు హవా సాగిన.. 2014లో 108 స్థానాలు మాత్రమే దక్కాయి. మరి వచ్చే ఎన్నికల నాటికి లేదా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా.. జగన్ హవాను తట్టుకుని టీడీపీ ఎలా నిలబడుతుందనేది ప్రశ్న. అయినప్పటికీ.. 155 స్థానాలు గెలుస్తారా? అనేది పెద్ద ప్రశ్న. మరి అచ్చెన్నాయుడు.. వ్యూహం ఫలిస్తుందా? ఆయన జోస్యంతో చంద్రబాబు నిజంగానే 155 సీట్లు తెచ్చుకుంటారా? అనేది వేచి చూడాలి. ఇప్పటి వరకు అయితే.. అచ్చెన్న వ్యాఖ్యలు, జోస్యం సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుండడం గమనార్హం.
This post was last modified on August 28, 2021 3:50 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…