టాలీవుడ్లో కామెడీ వైభవం చాలా ఏళ్ల కిందటే పోయింది. బ్రహ్మానందం డౌన్ అయిపోవడం.. ఎమ్మెస్ నారాయణ, వేణు మాధవ్, ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం లాంటి మేటి కమెడియన్లు కాలం చేయడం.. సునీల్ హీరోగా మారి కమెడియన్ ఇమేజ్‌ను దెబ్బ తీసుకోవడంతో తెరపై నవ్వులకు కరవొచ్చేసింది.
తర్వాతి తరంలో కూడా కొందరు మంచి కమెడియన్లు ఉన్నారు కానీ.. తెరపై ముందులా కామెడీ అయితే పండట్లేదు. ఇప్పుడు తెలుగు సినిమాల్లో కామెడీ తీరే మారిపోయింది. ఇప్పుడంతా హడావుడి లేకుండా సటిల్‌గా సాగిపోతోంది. ఇలాంటి కామెడీ చేయడంలో వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లాంటి ఈ తరం కమెడియన్లు ప్రత్యేకత చాటుకుంటున్నారు.
ఐతే వీరి మధ్య అనుకున్నంత పేరు రాని మరో మంచి కమెడియన్ ఉన్నాడు. అతనే.. సత్య. ఇప్పటికే పదుల సంఖ్యలో సినిమాలు చేసినా.. ప్రతి చిత్రంలోనూ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించినా సత్యకు రావాల్సినంత పేరైతే రాలేదు.
సత్యలో ఎంత మంచి నటుడున్నాడనే విషయం తాజాగా సోనీ లివ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘వివాహ భోజనంబు’తో రుజువైంది. ఈ చిత్రంతోనే సత్య హీరోగా మారాడు. ఫుల్ లెంగ్త్ రోల్‌లో అతను ఆద్యంతం ఆకట్టుకున్నాడు. ఆ సినిమాను అతను తన భుజాల మీద నడిపించాడంటే అతిశయోక్తి కాదు. కరోనా నేపథ్యంలో నడిచే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లు లేదన్న టాక్ వస్తోంది.
ట్రైలర్లో ఉన్నంత ఫన్ సినిమాలో లేదన్నది పెద్ద కంప్లైంట్. ఐతే సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ సత్య మాత్రం తన నటనతో నూటికి నూరు మార్కులు వేయించుకున్నాడు. ప్రతి సన్నివేశంలోనూ తనదైన టైమింగ్‌తో నవ్వించే ప్రయత్నం చేశాడు.
సత్యను సరిగ్గా వాడుకోవాలే కానీ.. అతను ఎలా ఒక పాత్రను పండించగలడో చెప్పడానికి ‘వివాహ భోజనంబు’ రుజువు. ఈ సినిమాలో అతను కొన్ని చోట్ల ఎమోషన్లను కూడా బాగా పండించాడు. సునీల్ ఒకప్పుడు చేసిన ‘అందాల రాముడు’ స్టయిల్లో కామెడీ ప్రధాన సినిమాలు చేసుకుంటే సత్య మంచి స్థాయికి చేరుకునే అవకాశముంది.
This post was last modified on August 28, 2021 10:53 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…