టాలీవుడ్లో బెస్ట్ ఫిజిక్ ఉన్న హీరోల్లో సుధీర్ బాబు ఒకడు. బేసిగ్గా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కావడంతో ముందు నుంచి సుధీర్ మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇక సినిమాల్లోకి వచ్చాక ఇంకా శ్రద్ధ పెట్టి కళ్లు చెదిరేలా బాడీని తీర్చిదిద్దుకున్నాడు. ‘బాగి’ సినిమాలో నటించేటపుడు బాలీవుడ్ నటులకు దీటుగా అతను బాడీ పెంచాడు. అక్కడి నుంచి తెలుగు సినిమాల్లో కూడా తన ‘ప్యాక్స్’ చూపిస్తున్నాడు.
‘వి’లో సుధీర్ చిజిల్డ్ బాడీ చూసి అందరూ వావ్ అనుకున్నారు. బహుశా తెలుగులో మరే నటుడికీ అలాంటి శరీరాకృతి లేదంటే అతిశయోక్తి కాదు. తన కొత్త చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’లోనూ సుధీర్ బేర్ బాడీతో కనిపించి ఆకట్టుకున్నాడు. ఐతే ఈ సినిమా ప్రమోషన్ల కోసం మీడియాను కలిసినపుడు ఫిజిక్.. ఫిట్నెస్ గురించి అడిగితే సుధీర్ ఒకింత అసహనానికి గురయ్యాడు. ప్రతిసారీ అదే అడుగుతుండటం ఇబ్బందిగా ఉందని సుధీర్ అన్నాడు.
“అందరూ నా ఫిజిక్ గురించే అడుగుతుంటే చిరాకొచ్చేస్తోంది. హీరో అన్నాక ఇలా ఉండాలి.. ఫిట్‌గా ఉండాలి అనుకునే ఇండస్ట్రీలోకి వచ్చాను. అందుకే ఇలా మెయింటైన్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు అందరి ఫోకస్ దాని మీదే ఉంటోంది. దీనిపై ఒక ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేద్దామనుకుంటున్నా.. ఇక బొజ్జ పెంచుతున్నా అని. అప్పుడైనా నా నటన గురించి మాట్లాడతారేమో చూడాలి మరి’’ అని సుధీర్ అన్నాడు. సుధీర్ ఇలా ఫ్రస్టేట్ కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. మొదట్లో అతడి నటన గురించి అందరూ విమర్శలు చేసిన వాళ్లే. ఆ నెగెటివిటీనంతా పోగొట్టుకోవడానికి చాలానే కష్టపడ్డాడు సుధీర్.
‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ దగ్గర్నుంచి అతను నటుడిగా తనేంటో ప్రతిసారీ రుజువు చేస్తూనే ఉన్నాడు. సమ్మోహనం, నన్ను దోచుకుందువటే చిత్రాల్లోనూ చాలా బాగా నటించాడు. ‘శ్రీదేవి సోడా సెంటర్’లోనూ సుధీర్ అదరగొట్టినట్లే ఉన్నాడు. కానీ తన నటన కంటే ఫిజిక్ గురించి ఎక్కువ చర్చ జరుగుతుండటం సుధీర్‌కు నచ్చుతున్నట్లు లేదు.
This post was last modified on August 27, 2021 8:27 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…