ఇంటర్నెట్లో అశ్లీల వీడియోలకు ఉండే ఆదరణే వేరు. దీని గురించి బయట పెద్దగా చర్చ జరగదు కానీ.. ఇదొక వేరే ప్రపంచం. ఆ ప్రపంచంలో ఎల్లప్పుడూ కోట్లమంది కనెక్ట్ అయి ఉంటారు. బయటికి మామూలుగా కనిపించే వాళ్లలో చాలామంది బూతు వీడియోలు చూసి పరవశం పొందేవాళ్లే. వీళ్లను ఆనందపరుస్తూ డబ్బులు సంపాదించే నెట్ వర్క్ కూడా చాలా పెద్దదే.
ఎక్కడెక్కడో కెమెరాలు పెట్టేసి శృంగార దృశ్యాలను రికార్డ్ చేసి వాటిని పోర్న్ వెబ్ సైట్లకు అమ్మి సొమ్ము చేసుకునే వ్యక్తులు మన చుట్టూనే ఉంటారు. ఈ పాయింట్ మీద సినిమాల్లో పెద్దగా చర్చ జరగదు. దీని మీద ఫిలిం మేకర్స్ ఎప్పుడూ అంత ఫోకస్ పెట్టరు.
ఐతే ఈ పాయింట్ మీద ఇప్పుడో ఆసక్తికర వెబ్ సిరీస్ తెరకెక్కింది. అదే.. నెట్. సెప్టెంబరు 10న జీ5లో స్ట్రీమ్ కాబోతున్న ఈ సిరీస్ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. అది ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
‘నెట్’లో కమెడియన్ రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్ చేశాడు. అవికా గోర్ కీలక పాత్ర పోషించింది. నిత్యం బూతు వీడియోలు చూడ్డమే కాక.. సీక్రెట్‌గా కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేసి వాటిని అమ్మడం ద్వారా సొమ్ము చేసుకునే వ్యక్తి పాత్రలో రాహుల్ రామకృష్ణ నటించడం విశేషం. అతడి తీరు భార్య సహా అందరికీ సందేహాలు కలిగిస్తుంటుంది. కానీ అతను ఆ బలహీనతను వదులుకోలేడు.
ఈ క్రమంలో అవికా గోర్ వీడియోలనూ రికార్డ్ చేస్తాడు. దీంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. తదనంతర పరిణామాలేంటన్నదే ఈ సిరీస్ కథ. క్రైమ్ ఎలిమెంట్స్ చుట్టూ చాలా ఉత్కంఠభరితంగా ఈ కథ నడుస్తుందనే సంకేతాలు ట్రైలర్లో కనిపించాయి. భార్గవ్ నాచర్ల అనే కొత్త దర్శకుడు ‘నెట్’ సిరీస్‌ను డైరెక్ట్ చేశాడు.
అవికా గోర్ చాలా బోల్డ్‌గా నటించినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. రాహుల్ రామకృష్ణ ఓ రేంజ్ పెర్ఫామెన్స్ ఇచ్చినట్లున్నాడు. ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలాగే కనిపిస్తోంది.
This post was last modified on August 26, 2021 3:01 pm
ఇటీవలే సన్నీ డియోల్ జాట్ తో బాలీవుడ్లో అడుగు పెట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని తర్వాతి సినిమా బాలకృష్ణతో ఉండబోతోంది.…
ఏపీకి చెందిన క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మరణంపై నెలకొన్న అస్పష్టతకు తెర పడిపోయింది. ఈ మేరకు ఏలూరు రేంజి…
ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…
ఏపీలో రాముడి తరహా రామరాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రామరాజ్యం అంటే.. ఏపీ సమగ్ర అభివృద్ధి…
తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.…
హీరోలు మాత్రమేనా పాన్ ఇండియా రేంజికి వెళ్లేది.. నిర్మాతలు వెళ్లలేరా అన్నట్లు బహు భాషల్లో సినిమాలు తీస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ అగ్ర…