‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 రిలీజైన దగ్గర నుంచి సమంత చుట్టూ చాలా గాసిప్స్ తిరుగుతున్నాయి. ప్రభాస్-నాగశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘ప్రాజెక్ట్ కె’లో సమంతను తీసుకోవాలనుకున్నారని.. కానీ నాగశ్విన్ ఆమెని పక్కన పెట్టారని వార్తలొచ్చాయి. అలానే పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు టాక్ వచ్చింది. వీటన్నింటిపై తాజాగా అక్కినేని కోడలు స్పందించింది.
ప్రభాస్ సినిమాలో ఆఫర్ వస్తుందని అనుకున్నట్లు.. నాగశ్విన్ తనకే ఛాన్స్ ఇస్తాడని అనుకున్నానని.. కానీ అలా జరగలేదని చెప్పుకొచ్చింది. అలానే ప్రభాస్ సినిమా నుండి సమంతను తీసేశారని.. నాగశ్విన్ సమంతకు ఛాన్స్ ఇవ్వలేదంటూ ఇంటర్నెట్ లో వార్తలు కనిపిస్తున్నాయని.. దీని గురించి నాగశ్విన్ ను గట్టిగా అడగాలనుకుంటున్నా అంటూ నవ్వుతూ రియాక్ట్ అయింది సమంత. ప్రస్తుతం తనకు కొత్త సినిమాలు చేసే మూడ్ లేదని.. కొన్ని నెలల పాటు గ్యాప్ తీసుకుంటానని చెప్పుకొచ్చింది.
‘శాకుంతలం’ షూటింగ్ పూర్తయిందని.. కొంతకాలం పాటు కొత్త కథలు కూడా విననని స్పష్టం చేసింది. గ్యాప్ తీసుకొని కథలు వినడం మొదలుపెడతానని చెప్పింది. ఇప్పటివరకు అయితే కొత్త సినిమా ఏదీ ఒప్పుకోలేదని.. పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలో కూడా తను లేనట్లు క్లారిటీ ఇచ్చింది సమంత. భవిష్యత్తులో మహిళలు ప్రభావితం చేసే పాత్రల్లో నటించాలనుందంటూ చెప్పుకొచ్చింది.
మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…
ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…
కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…
2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…
ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…
యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…