Movie News

అఖిల్ త‌ట్టుకోగ‌ల‌డా?


అక్కినేని అఖిల్‌కు అర్జెంటుగా ఒక హిట్టు కావాలి. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చి అత‌డి తొలి చిత్రం అఖిల్ పెద్ద డిజాస్ట‌ర్ కాగా.. ఆశ‌లు రేకెత్తించిన హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాల‌కు కూడా చేదు అనుభ‌వాలే మిగిలాయి. ఆ త‌ర్వాత అఖిల్ గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బేన‌ర్లో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ మూవీ చేశాడు. అది పోయినేడాది వేస‌విలోనే విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా కార‌ణంగా వాయిదా త‌ప్ప‌లేదు.

సినిమా పూర్త‌యిపోయినా స‌రే.. ఇప్పుడిప్పుడే థియేట‌ర్ల‌లో వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు. మ‌ధ్య‌లో ఓటీటీ రిలీజ్ అంటూ ప్ర‌చారం జ‌రిగింది కానీ.. అలా చేస్తే అఖిల్ కెరీర్‌కు మంచిది కాద‌న్న ఉద్దేశంతో వెన‌క్కి త‌గ్గిన‌ట్లున్నారు మేక‌ర్స్. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రాన్ని ద‌స‌రా రేసులో నిల‌ప‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. యూనిట్ వ‌ర్గాలు కూడా ఈ విష‌యాన్ని ధ్రువీక‌రిస్తున్నాయి.

ఐతే ద‌స‌రా సీజ‌న్లో పోటీ కాస్త గ‌ట్టిగానే ఉండేలా ఉంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్య‌తో పాటు నంద‌మూరి బాల‌కృష్ణ మూవీ అఖండ ద‌స‌రాకే వ‌స్తాయ‌ని అంటున్నారు. నిజానికి ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌రు 13న ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రం రావాల్సింది. కానీ క‌రోనా సెకండ్ వేవ్ దెబ్బ ప‌డ‌టంతో ఆ స‌మ‌యానికి సినిమాను సిద్ధం చేయ‌లేమ‌ని వాయిదా వేసేశారు. దీంతో ఆ ఖాళీని ఆచార్య‌, అఖండ సినిమాలు భ‌ర్తీ చేస్తాయిని అంటున్నారు.

ఐతే చిరు, బాల‌య్య‌ల తాకిడిని త‌ట్టుకుని అఖిల్ త‌న ఉనికిని చాట‌గ‌ల‌డా అన్న‌ది ప్ర‌శ్న‌. చిరు కుటుంబంతో అఖిల్‌కు వ్య‌క్తిగ‌తంగా మంచి అనుబంధం ఉంది. చ‌ర‌ణ్‌ను అన్న‌య్య‌లా చూస్తాడ‌త‌ను. మ‌రి చిరు సినిమా బ‌రిలో ఉండ‌గా.. అఖిల్ ఆయ‌న‌తో పోటీకి దిగుతాడా అన్న‌ది ప్ర‌శ్న‌. బ‌హుశా ద‌స‌రా సెల‌వుల్లోనే కొన్ని రోజుల గ్యాప్‌లో ఈ చిత్రాన్ని షెడ్యూల్ చేయాల‌ని అనుకుంటున్నారేమో మేక‌ర్స్.

This post was last modified on August 25, 2021 12:10 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అల్లరోడికి పరీక్ష : 1 అవకాశం 3 అడ్డంకులు!

పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…

15 minutes ago

ఇలాగైతే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకు ఇబ్బందులే..

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…

31 minutes ago

వైసీపీని ఎవ‌రు న‌మ్ముతారు.. రెంటికీ చెడుతోందా..!

వైసీపీ తీరు మార‌లేదు. ఒక‌వైపు.. ఇండియా కూట‌మిలో చేరేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్న‌ట్టు ఆ పార్టీ కీల‌క నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు…

3 hours ago

బైడెన్ వ‌ర్సెస్ ట్రంప్‌.. న‌లిగిపోతున్న విదేశీయులు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణుల‌ను ఇర‌కాటంలోకి నెడుతున్నాయి. మ‌రో రెండు మూడు వారాల్లోనే…

12 hours ago

ఆ ఖైదీ జైలు శిక్ష‌ ఫిఫ్టీ-ఫిఫ్టీ.. భార‌త్‌, బ్రిట‌న్ ఒప్పందం!

జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చ‌ర్యం అంద‌రికీ క‌లుగుతుంది. కానీ, ఇది వాస్త‌వం. దీనికి సంబంధించి…

13 hours ago