వ‌ర్కౌట్లోనూ అదే స్ట‌యిలా మ‌హేషా..

స్టార్ హీరోల్లో ప్ర‌తి ఒక్క‌రికీ కొన్ని ప్ర‌త్యేక‌మైన మేన‌రిజ‌మ్స్ ఉంటాయి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మెడ‌పై చేతిని రుద్దడంలో ఒక స్టైల్ ఉంటుంది. విక్ట‌రీ వెంక‌టేష్ వేలిని కాస్త వంక‌ర‌గా పెట్టి స్టైల్ చూపిస్తాడు. ఇలా ఒక్కో హీరోకు ఒక్కో ర‌క‌మైన స్టైల్ లేదా‌ మేన‌రిజం ఉంటుంది.

మ‌హేష్ బాబు విష‌యానికి వ‌స్తే అత‌ను నిల‌క‌డ‌గా ఒక స్టైల్ మెయింటైన్ చేస్తున్న‌దైతే.. ప‌రుగెత్తే విష‌యంలోనే. అత‌డి ప‌రుగులో ఒక ఇంటెన్సిటీ ఉంటుంది. చేతుల్ని ఊపే తీరే వేరుగా ఉంటుంది. పోకిరి సినిమాతో ఈ స్టైల్ బాగా పాపుల‌ర్ అయింది.

ఈ మ‌ధ్య మ‌హ‌ర్షిలోనూ అదే స్ట‌యిల్లో ప‌రుగెత్తి అభిమానుల‌కు నోస్టాల్జిక్ ఫీలింగ్ తెచ్చాడు. ఐతే మ‌హేష్ స‌హ‌జంగానే అలా ప‌రుగెడ‌తాడా.. లేక ఉద్దేశ‌పూర్వ‌కంగా ఆ స్ట‌యిల్ మెయింటైన్ చేస్తాడా అనే విష‌యంలో స్ప‌ష్ట‌త లేదు.

ఐతే తాజాగా మ‌హేష్ వ‌ర్క‌వుట్ వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలోకి వచ్చింది. లాక్ డౌన్ టైంలో మ‌హేష్ థ్రెడ్ మిల్ మీద ప‌రుగెడుతున్న వీడియో తీసి దాన్ని అత‌డి భార్య న‌మ్ర‌త శిరోద్క‌ర్ ఇన్‌స్టాగ్రాంలో అభిమానుల‌తో పంచుకుంది. మ‌హేష్‌కు సంబంధించి వ‌ర్క‌వుట్ వీడియో బ‌య‌టికి రావ‌డం ఇదే తొలిసారి.

అందులో మ‌హేష్ ప‌రుగెత్తుతున్న సినిమాల్లో ప‌రుగునే గుర్తుకు తెస్తోంది. దీన్ని బ‌ట్టి మ‌హేష్ స‌హ‌జంగానే ఇలా ప‌రుగెడుతాడ‌ని.. అది స్టైల్ కోసం సెట్ చేసుకున్న‌ది కాద‌ని అర్థ‌మ‌వుతోంది. లాక్ డౌన్ నేప‌థ్యంలో మ‌హేష్‌కు సంబంధించి గ‌త రెండు నెల‌ల్లో ఎన్నో ప‌ర్స‌న‌ల్ ఫొటోలు, వీడియోలు బ‌య‌టికి వ‌చ్చాయి. అవి అభిమానులను బాగా అల‌రిస్తున్నాయి. లేటెస్ట్ వర్కవుట్ వీడియో కూడా ఆ కోవ‌లోనిదే.