యూత్ స్టార్ నితిన్ కొత్త సినిమా మాస్ట్రో విషయంలో నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. ఈ చిత్రానికి థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి హాట్ స్టార్ ఓటీటీలో నేరుగా రిలీజ్ చేయబోతున్నట్లు రెండు నెలల కిందటే సమాచారం బయటికి వచ్చింది కానీ.. ఎంతకీ ప్రిమియర్స్ సంగతి తేల్చలేదు. ఐతే ఎట్టకేలకు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు. అందులోనూ ప్రిమియర్స్ డేట్ కూడా ఇచ్చేశారు. వినాయక చవితి ముందు రోజు, అంటే సెప్టెంబరు 9న మాస్ట్రో హాట్ స్టార్‌లో స్ట్రీమ్ కాబోతోంది.
ఇక ఈ చిత్ర ట్రైలర్ విషయానికి వస్తే.. ఆద్యంతం ఆసక్తికరంగానే సాగింది. హిందీ చిత్రం అంధాదున్‌కు రీమేక్‌గా తెరకెక్కిన మాస్ట్రో.. ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఒరిజినల్‌ను ఫాలో అయిపోయినట్లే కనిపిస్తోంది. ట్రైలర్ చూస్తే సినిమాలో హీరో నితిన్ కంటే కూడా ఇందులో కీలక పాత్ర పోషించిన తమన్నానే హైలైట్ అవుతుందనిపిస్తోంది.
మాతృకలో టబు చేసిన సెన్సేషనల్ క్యారెక్టర్లో తమన్నా నటిస్తోంది. అక్కడ టబు మిడిలేజ్డ్ కాబట్టి గ్లామర్ విందు చేయడానికి పెద్దగా స్కోప్ లేకపోయింది. కానీ ఇక్కడ ఆ పాత్ర చేస్తున్నది తమన్నా కావడంతో ఆ పాత్రకు ఒక సెక్సప్పీల్ వచ్చింది. ఈ చిత్రంలో తమన్నాకు జోడీగా, ఆమె భర్తగా సీనియర్ నటుడు నరేష్ నటించడం విశేషం.
తమన్నా రేంజ్, ఆ వయసు హీరోయిన్లెవ్వరూ కూడా నరేష్‌కు జోడీగా నటించే సాహసం చేయరు. కానీ తమన్నా ధైర్యం చేసింది. పాత్ర డిమాండ్ మేరకు తమన్నాకు ఆయనకు భార్యగా నటించడానికే సిద్ధపడింది. మిడిలేజ్డ్ భర్తతో పైకి సంతోషంగా కనిపిస్తూ తన వయసు వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకునే పాత్ర ఇది. తమన్నా లాంటి స్టార్ హీరోయిన్ ఇలాంటి పాత్ర చేయడానికి రెడీ అవడం కచ్చితంగా విశేషమే. ఈ పాత్రతో తమ్మూ సెన్సేషన్ క్రియేట్ చేయడం.. సినిమాకే హైలైట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on August 24, 2021 7:08 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…