సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న ఇద్దరు హీరోలతో మల్టీస్టారర్ చేయడం అంత తేలికైన విషయం కాదు. అలాగే అలాంటి ఇమేజ్ ఉన్న ఇద్దరు హీరోయిన్లతో సినిమా అన్నా కూడా కొంచెం కష్టమైన విషయమే. ఇద్దరి ఇమేజ్‌లను బ్యాలెన్స్ చేస్తూ పాత్రలు ఉండేలా చూసుకోవాలి. ఇద్దరి మధ్య ఎలాంటి ఇగో క్లాషెస్ రాకుండా చూసుకోవడమూ కీలకమే. ఐతే తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ ఇప్పు ఈ సాహసమే చేస్తున్నాడు.
సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్లయిన నయనతార, సమంతలతో అతను ఒక సినిమా తీస్తున్నాడు. ఇందులో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ ముగ్గురి కలయికే సినిమా మీద ప్రత్యేక ఆసక్తికి కారణమవుతోంది. నయన్, సామ్ కలిసి ఇప్పటిదాకా ఏ చిత్రంలోనూ నటించలేదు. స్టార్ హీరోల కమర్షియల్ సినిమాలోనూ స్క్రీన్ షేర్ చేసుకోలేదు.
అలాంటిది ఇప్పుడు హీరోయిన్ ప్రాధాన్యమున్న థ్రిల్లర్ మూవీలో కలిసి నటించబోతున్నారు. సినిమా తీస్తున్నది తన ప్రియుడే కావడంతో సామ్‌తో కలిసి నటించడానికి నయన్‌కు పెద్దగా అభ్యంతరం లేకపోయి ఉండి ఉండొచ్చు. ఐతే సమంత ఈ సినిమాలో నటించడానికి ఇబ్బంది పడకుండా ఆమె సెట్లోకి అడుగు పెట్టగానే ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది నయన్. ‘ఫ్యామిలీ మ్యాన్-2’లో అద్భుత నటనకు గాను సమంతకు ఓ అంతర్జాతీయ పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే. ఇందుకు ఆమెను అభినందిస్తూ తమ సినిమా సెట్స్‌లోకి అడుగు పెట్టిన సందర్భంగా గ్రాండ్ వెల్కమ్ చెప్పింది నయన్ అండ్ టీం. సమంతకు శుభాకాంక్షలు చెబుతూ కేక్ తయారు చేయించి ఆమెతో దాన్ని కట్ చేయించారు. చిన్న పార్టీ కూడా ఇచ్చారు.
ఈ సర్ప్ర్రైజ్ సమంతను ఎంతో ఆనందింపజేసినట్లే ఉంది ఫొటోలు చూస్తుంటే. సమంత, నయన్ కలిసి చాలా సదరాగా పార్టీ చేసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇద్దరు సూపర్ స్టార్ హీరోయిన్లు ఇలా సరదాగా కనిపిస్తున్న ఫొటోలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.
This post was last modified on August 23, 2021 3:21 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…