ఓటీటీల జోరు బాగా పెరిగిన గత రెండేళ్లలో వివిధ భాషల వాళ్లకు మలయాళ సినిమాల సత్తా ఏంటో బాగా తెలిసింది. అక్కడి నటీనటుల ప్రతిభ కూడా అందరికీ అర్థమవుతోంది. ఈ కాలంలో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించిన మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్. కుంబలంగి నైట్స్, ట్రాన్స్, జోజి, మాలిక్ లాంటి సినిమాలు అతడి ప్రతిభ ఏంటో అందరికీ తెలిసేలా చేశాయి.
అలాంటి గొప్ప నటుడు తెలుగులోకి అడుగు పెడుతుండటం మన ప్రేక్షకులను బాగా ఎగ్జైట్ చేస్తోంది. అందులోనూ ఆ చిత్రం అల్లు అర్జున్-సుకుమార్‌ల కలయికలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ కావడంతో ఆసక్తి రెట్టింపు అవుతోంది. మలయాళంలో కొన్ని కొన్ని చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఫాహద్ అదరగొట్టేశాడు. కళ్లతోనే భయం పుట్టించడం, శాడిజం చూపించడంలో ఫాహద్ ప్రత్యేకతే వేరు. విలన్ పాత్రలను చాలా బలంగా తీర్చిదిద్దే సుకుమార్ అతడి కోసం అదిరిపోయే పాత్రే సిద్ధం చేసి ఉంటాడన్న అంచనాలతో ప్రేక్షకులు ఉన్నారు.
అలాగే హీరో, విలన్ పాత్రలకు తనదైన శైలిలో మేకోవర్ ఇచ్చే అలవాటు ఉన్న సుకుమార్.. ఫాహద్ పాత్రను ఎలా ప్రెజెంట్ చేస్తాడో అన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది.
చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఫాహద్ ఇందులో స్టన్నింగ్ లుక్‌లో కనిపించనున్నాడట. అతను గుండుతో కనిపిస్తాడని తెలిసింది. మేకప్ చాలా బాగా కుదిరిందని.. ఇందులో ఫాహద్‌ను చూడగానే ప్రేక్షకులు స్టన్నవుతారని అంటున్నారు. ఫాహద్ చేస్తున్నది ఐపీఎస్ అధికారి పాత్ర అన్న సంగతి ఇప్పటికే రివీలైంది. ఐతే స్వతహాగా ఉత్తరాది వ్యక్తి అయినప్పటికీ.. ఏపీలోని చిత్తూరు జిల్లాలో పని చేసే అధికారిగా ఫాహద్ కనిపించనున్నాడట.
గత నెలలో ఒకసారి హైదరాబాద్‌కు వచ్చి లుక్ టెస్ట్ చేయించుకుని వెళ్లిన ఫాహద్.. రెండు రోజుల కిందటే షూటింగ్ కోసం తిరిగొచ్చాడు. అతడి మీద సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందిప్పుడు. ఫస్ట్ పార్ట్‌లో ఫాహద్ పాత్ర తక్కువ సన్నివేశాల్లోనే కనిపిస్తుందని.. ఆ పాత్ర సెకండ్ పార్ట్‌లో బన్నీ క్యారెక్టర్‌తో ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
This post was last modified on August 23, 2021 3:11 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…