మెగాస్టార్ చిరంజీవితో మెహర్ రమేష్.. ఏడాది కిందట మొదటగా ఈ సమాచారం బయటికి వచ్చినపుడు మెగా అభిమానులు బెంబేలెత్తిపోయారు. శక్తి, షాడో లాంటి ఆల్ టైం డిజాస్టర్లు తీసి ఏడెనిమిదేళ్లుగా అవకాశాలు లేక ఖాళీగా ఉన్న దర్శకుడికి చిరంజీవి అవకాశం ఇవ్వడమేంటనే ప్రశ్న వారి మెదళ్లను తొలిచేసింది.
మెహర్‌తో సినిమా వద్దే వద్దు అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఈ సినిమాకు సంబంధించి ఏ న్యూస్ వచ్చినా నెగెటివ్‌గానే స్పందించారు. ఈ చిత్రంపై ఏమాత్రం ఆసక్తి లేనట్లే వ్యవహరించారు. చిరు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా అప్‌డేట్ ఇవ్వబోతున్నట్లు వార్తలొచ్చినా వారిలో ఎగ్జైట్మెంట్ కనిపించలేదు.
చివరికి శనివారం సాయంత్రం ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. భోళా శంకర్ అనే క్యాచీ టైటిల్‌తో వచ్చాడు మెహర్ రమేష్. ఆ టైటిల్‌తో పాటు లోగో, పోస్టర్ డిజైన్ ఆకర్షణీయంగానే కనిపించాయి. ఇక ఈ రోజు రక్షాబంధన్ సందర్భంగా చిరు-కీర్తిలపై చిన్న వీడియో గ్లింపక్స్ కూడా రిలీజ్ చేశారు. అది కూడా ఓకే అనిపించింది. మొత్తానికి సినిమాకు సంబంధించి తాజాగా వెల్లడించిన విశేషాలు వావ్ అనిపించేలా లేకపోయినా.. వీటికి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అయితే లేదు. రెస్పాన్స్ పాజిటివ్‌గానే ఉంది.
ఇప్పటి వరకు అయితే మెహర్ రమేష్‌కు పాస్ మార్కులే పడతాయి. మునుపటితో పోలిస్తే ఇప్పుడు అతడి పట్ల మెగా అభిమానుల్లో నెగెటివిటీ తగ్గినట్లే ఉంది. సినిమా అయితే అనౌన్స్ అయిపోయింది, త్వరలో షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారు కాబట్టి వాస్తవాన్ని అంగీకరిస్తున్నట్లే ఉన్నారు ఫ్యాన్స్. ఎలాగూ ఇది రీమేక్ మూవీనే కాబట్టి ఈ చిత్రం ఎలా ఉంటుందో అన్న కంగారు కూడా అక్కర్లేదు. ఒక సగటు మాస్ మసాలా సినిమాతో చిరు-మెహర్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాబట్టి ఇక మెహర్ గురించి వాళ్లకు ఎక్కువ ఆందోళన అవసరం లేదేమో.
This post was last modified on August 22, 2021 10:03 pm
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్‌లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…