Movie News

ఆర్ఆర్ఆర్ టీం.. మ‌ళ్లీ ప్రెస్ మీట్‌?


దేశ‌మంతా భారీ అంచ‌నాల‌తో ఎదురు చూస్తున్న భారీ చిత్రం.. ఆర్ఆర్ఆర్. ఈ పాన్ ఇండియా మూవీకి ఇప్ప‌టికే రెండు రిలీజ్ డేట్లు మారాయి. 2020 జులై 30న‌, 2021 జ‌న‌వ‌రి 21న అంటూ రెండుసార్లు డేట్లు ఇచ్చి త‌ర్వాత అనివార్య ప‌రిస్థితుల్లో సినిమాను వాయిదా వేశారు. క‌రోనా సెకండ్ వేవ్ తాకిడిని కూడా త‌ట్టుకుని ఈ అక్టోబ‌రు 13న సినిమాను రిలీజ్ చేయాల‌ని ఎంతో ప‌ట్టుద‌ల‌తో ప్ర‌య‌త్నించారు కానీ.. అది సాధ్య‌ప‌డేలా లేదు. సినిమాను వాయిదా వేయడం మిన‌హా మ‌రో మార్గం లేద‌ని చిత్ర బృందం ఓ అంచ‌నాకు వ‌చ్చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఐతే మూడోసారి సినిమాను వాయిదా వేస్తున్న నేప‌థ్యంలో ఊరికే స్టేట్మెంట్ ఇచ్చి వ‌దిలేయ‌కుండా.. చిత్ర బృందంలోని ముఖ్యులు ఒక ప్రెస్ మీట్ నిర్వ‌హించాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా ఆరంభ ద‌శ‌లోనే రాజ‌మౌళి అండ్ కో ప్రెస్ మీట్ పెట్టి సినిమా క‌థ, పాత్ర‌ల గురించే కాక ప‌లు విశేషాల‌ను పంచుకున్న సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు సినిమా స్టేట‌స్ ఏంటో వెల్ల‌డించ‌డంతో పాటు త‌మ చిత్రాన్ని మ‌రోసారి ఎందుకు వాయిదా వేయాల్సి వ‌స్తోందో ఈ ప్రెస్ మీట్లో వివ‌రించ‌బోతున్నార‌ట‌. అలాగే మ‌రికొన్ని విశేషాల‌నూ పంచుకోనున్నార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ ప్రెస్ మీట్ గురించి మీడియాకు స‌మాచారం అందించ‌నున్నార‌ట‌. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ గురించి దేశ‌మంతో ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తోంది.

ఈ సినిమా రిలీజ్‌ను బ‌ట్టే వివిధ భాష‌ల్లో మిగ‌తా చిత్రాల డేట్లు ఖ‌రార‌వుతాయి. షెడ్యూళ్లు అటు ఇటు అవుతాయి. దాన్ని దృష్టిలో ఉంచుకునే త‌మ సినిమా విడుద‌లపై ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వాల‌ని, అలాగే ప్రేక్ష‌కుల‌కు స‌ర్దిచెప్ప‌డం కూడా త‌మ బాధ్య‌త అని భావిస్తున్నార‌ని తెలుస్తోంది. కొత్త రిలీజ్ డేట్‌ను కూడా ఈ ప్రెస్ మీట్లోనే ప్ర‌క‌టిస్తార‌ని.. ఆ డేట్‌కు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సినిమా రిలీజ్ కావ‌డం ప‌క్కా అని అంటున్నారు.

This post was last modified on August 18, 2021 10:32 am

Share
Show comments

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

59 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago