ఈ మధ్య తమిళ హీరోలు ఒక్కొక్కరుగా టాలీవుడ్ వైపు చూస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్.. వంశీ పైడిపల్లితో ఓ బహు భాషా సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడు. అలాగే ధనుష్.. శేఖర్ కమ్ముల కాంబినేషన్లో సినిమా రాబోతోంది. దీని గురించి ఇప్పటికే ప్రకటన కూడా వచ్చింది. దీని తర్వాత మరో తెలుగు దర్శకుడితో ధనుష్ జట్టు కట్టబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ డైరెక్టరే వెంకీ అట్లూరి.
తొలిప్రేమతో దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వెంకీ.. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, రంగ్‌దె చిత్రాలతో అంచనాలను అందుకోలేకపోయాడు. కానీ అతను చెప్పిన ఓ కథ నచ్చి ధనుష్ సినిమా చేయడానికి ఓకే అన్నట్లు తెలుస్తోంది. ఇది పాన్ ఇండియా మూవీ అంటున్నారు. తెలుగు, తమిళంతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా తెరకెక్కనుందట.
వెంకీతో రంగ్‌దె సినిమాను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో ఈ చిత్రం రూపొందనుందట. ఈ చిత్రానికి కథానాయిక కూడా ఖరారైనట్లు తాజా సమాచారం. ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న పూజా హెగ్డే ఈ చిత్రానికి కథానాయికగా ఓకే చేశారట. ధనుష్‌తో పూజా చేయనున్న తొలి చిత్రమిదే. ఈ చిత్రం విద్యా వ్యవస్థను బాగు చేయడానికి తపించే ఓ కుర్రాడి కథతో తెరకెక్కనున్నట్లుగా చెబుతున్నారు. కాన్సెప్ట్ ఇండియాలో అందరూ రిలేట్ చేసుకునేలా ఉంటుందని.. అందుకే ధనుష్ ఈ చిత్రం చేయడానికి ముందుకొచ్చాడని సమాచారం.
ఐతే ఈ సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టొచ్చు. ధనుష్ తమిళంలో మూడు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అవి పూర్తి చేసి శేఖర్ కమ్ముల సినిమా కూడా చేశాక ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే అవకాశముంది.
This post was last modified on August 16, 2021 10:59 am
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…