Movie News

సల్మాన్ ఖాన్.. 300 కోట్ల సినిమా

సినీ రంగంలో దేన్నయినా టేకిట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటే ఏమవుతుందో షారుఖ్ ఖాన్ విషయంలో అందరూ చూశారు. తాను ఏ సినిమా తీసినా బ్రహ్మాండంగా ఓపెనింగ్స్ వచ్చేస్తున్నాయని.. సినిమాలో తానుంటే చాలని, కథ గురించి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరనే ఫీలింగ్‌తో కొన్నేళ్ల పాటు వరుసగా సాధారణమైన సినిమాలు చేశాడు షారుఖ్.

ఈ క్రమంలో ‘హ్యాపీ న్యూ ఇయర్’ లాంటి చెత్త సినిమాలకు కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఇలా వరుసబెట్టి మామూలు సినిమాలు తీస్తుంటే ఒక దశ దాటాక ప్రేక్షకులకు మొహం మొత్తేస్తుంది. ఆ హీరో మీద నమ్మకం కోల్పోతారు. వరుసగా సినిమాలను తిరస్కరించడం మొదలుపెడతారు. షారుఖ్ విషయంలోనూ అదే జరిగింది.

అంత పెద్ద స్టార్ సినిమాలకు రూ.50 కోట్ల ఓపెనింగ్స్ కూడా రాని పరిస్థితి తలెత్తింది. చివరగా షారుఖ్ నుంచి వచ్చిన ‘జీరో’తో అతను దాదాపు జీరో అయిపోయాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రెండేళ్లకు పైగా విరామం తీసుకుని జాగ్రత్తగా సినిమాలు సెట్ చేసుకుంటున్నాడు.

షారుఖ్ తర్వాత సల్మాన్ సైతం పనికి రాని సినిమాలతో ప్రేక్షకుల తిరస్కారానికి గురవుతున్నాడు. ఈ మధ్యే వచ్చిన అతడి చిత్రం ‘రాధె’ చూసి అభిమానులు కూడా ఛీకొట్టారు. మరీ ఇంత నాసిరకం సినిమాలు తీస్తావా అంటూ సోషల్ మీడియా వేదికగా సల్మాన్‌పై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం అతను ‘అంతిమ్’, ‘కభీ ఈద్ కభీ దివాలి’ అనే సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ‘మాస్టర్’ రీమేక్‌లో నటిస్తాడని ప్రచారం జరిగింది.

కానీ ఇప్పుడు సల్మాన్ ఆలోచన మారినట్లు సమాచారం. వరుసగా రొటీన్ మాస్ మసాలా సినిమాలు చేస్తే ప్రేక్షకుల్లో పలుచన అయిపోతానని భావించి.. ఇప్పుడో ప్రయోగాత్మక భారీ చిత్రం చేయడానికి అతను రెడీ అయ్యాడట. మ్యాన్ వెర్సస్ నేచర్ కాన్సెప్ట్‌గా పూర్తిగా అటవీ నేపథ్యంలో సాగే ఒక భారీ సినిమాకు సల్మాన్ సన్నాహాలు చేసుకుంటున్నాడట.

ఈ చిత్ర బడ్జెట్ రూ.300 కోట్లని.. సల్మాన్ కెరీర్లోనే అత్యధిక ఖర్చుతో తెరకెక్కనున్న చిత్రమిదని.. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా చేయడానికి తన టీంతో కలిసి సల్మాన్ పని చేస్తున్నాడని.. త్వరలోనే దీని గురించి అనౌన్స్‌మెంట్ రానుందని బాలీవుడ్ వర్గాల సమాచారం.

This post was last modified on August 16, 2021 6:48 am

Share
Show comments
Published by
Satya
Tags: Salman Khan

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago