‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన వెబ్ సిరీస్ ఇదే అంటే అతిశయోక్తి కాదు. మామూలుగా వెబ్ సిరీస్‌లు ఎక్కువగా యూత్ చూస్తుంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిని అవి పెద్దగా ఆకర్షించలేదు. ఇందుక్కారణం వెబ్ సిరీస్‌లు ఎక్కువగా థ్రిల్లర్ జానర్లో తెరకెక్కడం, బోల్డ్‌నెస్ ఎక్కువ ఉండటం. ఐతే ‘ఫ్యామిలీ మ్యాన్’ మాత్రం ఇందుకు మినహాయింపు. అది అందరూ చూసి ఎంజాయ్ చేసేలా నీట్‌గా ఉంటుంది. పైగా ఫ్యామిలీ డ్రామా కూడా అందులో హైలైట్. అందుకే ఈ సిరీస్‌కు ఎక్కువ ఆదరణ లభించింది.
ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయ్యాక రెండో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూశారో? వారి నిరీక్షణకు తెరదించుతూ జూన్‌లో సెకండ్ సీజన్‌ను రిలీజ్ చేసింది అమేజాన్ ప్రైమ్. అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఉన్న సెకండ్ సీజన్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది.
కాకపోతే దక్షిణాది ప్రేక్షకులకు మాత్రం ఒకింత నిరాశ తప్పలేదు. తెలుగు, తమిళ వెర్షన్లు అందుబాటులో లేకపోవడంతో డిజప్పాయింట్ అయ్యారు. కొందరు ఉత్కంఠ ఆపులకోలేక సబ్‌టైటిల్స్ పెట్టుకుని హిందీ వెర్షనే చూసేశారు కానీ.. చాలామంది లోకల్ వెర్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించబోతోంది. ఇంకొన్ని రోజుల్లోనే ‘ఫ్యామిలీ మ్యాన్-2’ తెలుగు, తమిళం, ఇంగ్లిష్ ఆడియోలు అందుబాటులోకి రానున్నాయి. ఈ దిశగా ‘ఫ్యామిలీ మ్యాన్-2’లో కీలక పాత్ర పోషించిన సమంతనే సంకేతాలు ఇచ్చింది.
తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో డబ్బింగ్ చెబుతున్న ఫొటోలు పెట్టింది. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ పేరెత్తలేదు కానీ.. తెలుగు, తమిళంలో డబ్బింగ్ చెప్పిన విషయాన్ని మాత్రం వెల్లడించింది. అది ‘ఫ్యామిలీ మ్యాన్-2’ కోసమే అని.. త్వరలోనే అమేజాన్‌లో లోకల్ భాషల్లో ఈ సిరీస్ కొత్త సీజన్ చూసుకోవచ్చని అంటున్నారు. ఇదే నిజమైతే కోట్ల మందికి శుభవార్తే.
This post was last modified on August 13, 2021 12:39 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…