ఈ తరం యువ కథానాయకులు స్టేజ్‌ల మీద మాట్లాడేటపుడు ఎంత దూకుడుగా కనిపిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఇప్పటి యూత్‌ను ఆకట్టుకోవడానికి ఏదో ఒకటి కొత్తగా చేయాలి. భిన్నంగా మాట్లాడాలి. దూకుడుగా వ్యవహరించాలి. విజయ్ దేవరకొండ ఈ విషయంలో ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడనే చెప్పాలి. మరో యంగ్ హీరో విశ్వక్సేన్ ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివేశాడు. విజయ్‌ని మించి దూకుడుగా, సెన్సేషనల్‌గా మాట్లాడ్డానికి ట్రై చేస్తుంటాడతను. కొన్నిసార్లు అతను ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కు కూడా వెళ్లిపోతుంటాడు.
తాజాగా తన కొత్త చిత్రం ‘పాగల్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో విశ్వక్ స్పీచ్ టాక్ ఆఫ్ ద టాలీవుడ్‌గా మారింది. సినిమా మీద అతడికి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ.. అతను ‘పాగల్’ గురించి ఇచ్చిన స్టేట్మెంట్లు మామూలుగా లేవు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వల్ల మూత పడిపోయిన థియేటర్లను కూడా ‘పాగల్’ సినిమాతో తెరిపించేస్తానని విశ్వక్ స్టేట్మెంట్లు ఇవ్వడం విశేషం.
ఈ పరిస్థితుల్లో ‘పాగల్’ను రిలీజ్ చేస్తున్నావేంటి, కరెక్టేనా అని కొంతమంది సందేహించారని.. ఐతే సర్కస్‌లో ఉన్న సింహంతో ఎవ్వరైనా ఆడుకుంటారని, కానీ తాను అడివిలో సింహంతో ఆడుకునే టైపని.. అందుకే తన చిత్రాన్ని ఈ పరిస్థితుల్లో రిలీజ్ చేస్తున్నానని.. సినిమా మామూలుగా ఉండదని.. మూతపడిన థియేటర్లను సైతం తన సినిమాతో తెరిపిస్తానని.. తన పేరు విశ్వక్సేన్ అని.. అలా జరక్కపోతే పేరు మార్చుకుంటానని విశ్వక్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
మరోవైపు తన స్పీచ్ మొదలవుతున్నపుడే టైం లేటైందని.. బయట షాపులు మూసేస్తారని భయ్యాలు టెన్షన్ పడుతుండొచ్చని అనడం ద్వారా పరోక్షంగా వైన్ షాపుల ప్రస్తావన తెచ్చాడు విశ్వక్. అంతే కాక కింది నుంచి అభిమానులు మధ్య మధ్యలో అరుస్తుంటే.. ‘తాగుదాం.. మందు తాగుదాం’ అంటూ ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలోని డైలాగ్‌ను గుర్తు తెచ్చాడు విశ్వక్. సినిమా హిట్టయ్యాక కచ్చితంగా సెలబ్రేట్ చేసుకుందాం.. మందు తాగుదాం అంటూ మరోసారి అతను నొక్కి వక్కాణించాడు.
This post was last modified on August 12, 2021 3:13 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…