తెలుగు గాయనీ గాయకుల్లో సునీతకు ఉన్న పాపులారిటీనే వేరు. ఏదో ఒక రకంగా ఆమె తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది. గత ఏడాది మీడియా మ్యాన్ రామ్‌ను ఆమె రెండో పెళ్లి చేసుకోవడంతో మరింతగా మీడియాలో ఆమె పేరు నానింది. ఈ మధ్య సునీత యూట్యూబ్ ఛానెళ్లలోనూ తరచుగా కనిపిస్తోంది. వ్యక్తిగత, వృత్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటోంది.
ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తనతో ఓ దర్శకుడు చిత్రంగా వ్యవహరించడం గురించి వెల్లడించడం తెలిసిందే. తాజాగా మరో ఇంటర్వ్యూలో భాగంగా తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి ఆమె పంచుకుంది. ఒక సంగీత దర్శకుడి భార్య తనతో తీవ్ర అభ్యంతరంగా వ్యవహరించినట్లు సునీత చెప్పుకొచ్చింది. ఆమె కారణంగా తాను ఒక రాత్రంతా ఏడ్చినట్లు కూడా సునీత వెల్లడించడం గమనార్హం.
నేను ఓ పెద్ద సంగీత దర్శకుడి స్టూడియోలో పాట పాడటానికి వెళ్లినపుడు అనుకోని సంఘటన జరిగింది. అక్కడికి వెళ్లాక ఆ మ్యూజిక్ డైరెక్టర్ తన చేతిలో ఉన్న మైకు ఇచ్చి పాడమన్నారు. పాట పూర్తి చేసి మైక్ అక్కడ పెట్టి తిరిగి వస్తుంటే బయట ఆ సంగీత దర్శకుడి భార్య ఆసహ్యంగా మాట్లాడింది.
మైక్ తీసుకునేటప్పుడు మా ఆయన చేతి వేళ్లను తాకుతున్నావేంటి.. అసలేమనుకుంటున్నావు.. నీ ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించింది. ఆ మాటలకు నేను షాకయ్యాను. నా స్టైల్లో ఆమెకు సమాధానం ఇచ్చాను. అప్పుడు ధైర్యంతో మాట్లాడినప్పటికీ ఆమె అలా అడగడం చాలా బాధగా అనిపించింది. దాన్ని తలుచుకుంటూ ఆ రాత్రంతా ఏడ్చాను. ఇలా నా కెరీర్‌లో తప్పు లేకపోయినా నిందలు ఎదుర్కొన్నా. అప్పుడు కొందరిని కొట్టాలనిపించింది’’ అని సునీత వెల్లడించింది.
This post was last modified on August 11, 2021 8:46 am
టాలీవుడ్ కు అత్యంత కీలకమైన సంక్రాంతి పండగ అయిపోయింది. నిన్నటితో సెలవులు పూర్తయిపోయాయి. బాక్సాఫీస్ విజేతగా ఒక్క శాతం అనుమానం…
ఇటీవలే ముగిసిన సంక్రాంతి సంబరాల్లో ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున కోడి పందేలు జరిగాయి. ఈ పందేలను…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం 55వ వార్షిక సదస్సులు సోమవారం దావోప్ లో ప్రారంభం కానున్నాయి. దాదాపుగా విశ్వవ్యాప్తంగా ఉన్న అన్ని…
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అనేక రికార్డు మెగాస్టార్ చిరంజీవి పేరు మీదే ఉన్నాయి. ఒకప్పుడు ఆయన చూసిన వైభవమే వేరు.…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి చెడిందా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మైలేజీ పొందలేక, పదేళ్ల పాటు అధికారానికి…
సీనియర్ నటుడు నరేష్ వ్యక్తిగత జీవితం గురించి కొన్నేళ్ల ముందు ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. తెలుగు సినిమాల్లో బిజీ…