ఈ ఏడాది మలయాళంలో విడుదలైన ‘నాయట్టు’ (తెలుగులో వేట అని అర్ధం) అనే సినిమా అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కుంచకో బొబన్, జోజు జార్జ్, నిమిష సజయన్ లాంటి తారలు నటించారు. ఈ ముగ్గురు చుట్టూనే కథ తిరుగుతుంది. ఈ ముగ్గురు పోలీస్ ఉద్యోగులు ఊహించని విధంగా ఓ యాక్సిడెంట్ లో ఇరుక్కుంటారు. చేయని నేరం నుండి బయటపడడానికి నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరకు ఏం జరిగిందనే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించారు.
ఇప్పుడు ఈ సినిమాను తెలుగు, తమిళ, కనడ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగు రీమేక్ హక్కులను గీతాఆర్ట్స్ సంస్థ దక్కించుకుంది. ఇప్పుడు నటీనటులను ఎంపిక చేసే పనిలో పడింది. లేడీ పోలీస్ కానిస్టేబుల్ పాత్ర కోసం హీరోయిన్ అంజలిని ఎన్నుకున్నట్లు సమాచారం. అలానే జోజు జార్జ్ పాత్ర కోసం సీనియర్ నటుడు రావు రమేష్ ను అడుగుతున్నారట. మరో కీలకపాత్రలో సత్యదేవ్ లేదా శ్రీవిష్ణు కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
అలానే దర్శకుడిగా చాలా మంది పేర్లు అనుకుంటున్నారు. తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేయనున్న గౌతమ్ మీనన్ ను తెలుగు రీమేక్ కూడా డైరెక్ట్ చేయమని అడుగుదామనుకుంటున్నారు. మరోపక్క సుధీర్ వర్మ లాంటి యంగ్ డైరెక్టర్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని నిర్మాత అల్లు అరవింద్ భావిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!
This post was last modified on August 10, 2021 10:40 am
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…