Movie News

సైలెంటుగా ‘ఐకాన్’ పనులు


‘ఐకాన్’ అనే సినిమా గురించి చర్చ ఇప్పటిది కాదు. మూడేళ్ల ముందే మొదలవుతుందనుకున్న సినిమా అది. అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన సినిమా ఇది. అల్లు అర్జున్ సినిమా ‘నా పేరు సూర్య’ డిజాస్టర్ అయ్యాక అనౌన్స్ అయిన సినిమా ఇది. దీన్నే బన్నీ తర్వాతి సినిమాగా చేస్తాడని అనుకున్నారు. కానీ అనుకోకుండా ‘అల వైకుంఠపురములో’ వచ్చింది. ఆ తర్వాత అల్లు హీరో ‘పుష్ప’ చేస్తున్నాడు.

‘ఐకాన్’ సంగతి చాన్నాళ్ల పాటు ఎటూ తేల్చకుండా ఉండిపోయాడు. ఒక దశలో ఈ సినిమా ఆగిపోయిందని.. వేరే హీరోతో చేయబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. కానీ చివరికి ఆ ప్రచారాలు నిజం కాదని తేలింది. బన్నీతోనే వేణు ఈ సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ‘పుష్ప’ పార్ట్-1 పూర్తి కాగానే ఈ చిత్రాన్ని మొదలుపెట్టడానికి చూస్తున్నాడు బన్నీ. ఐతే కొన్ని నెలలుగా ఈ సినిమా గురించి సమాచారం అయితే ఏదీ బయటికి రాలేదు.

ఐతే హడావుడి లేకుండా సైలెంటుగా ‘ఐకాన్’ ప్రి ప్రొడక్షన్ పనులు జరిగిపోతున్నట్లు తెలిసింది. ఇంకో రెండు నెలల్లో బన్నీ ఈ సినిమాకు అందుబాటులోకి వస్తాడట. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులతో పాటు కాస్ట్ అండ్ క్రూ ఎంపిక పనిలో బిజీగా ఉన్నాడు వేణు. సినిమాలో ఇద్దరు హీరోయిన్లుంటారని.. ఇద్దరి పాత్రలకూ మంచి ప్రాధాన్యం ఉంటుందని.. ఆ పాత్రల కోసం పూజా హెగ్డే, రష్మిక మందన్నా పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారం.

పూజాతో ఇప్పటికే బన్నీ రెండు సినిమాలు చేశాడు. రష్మికతో ‘పుష్ప’లో కలిసి నటిస్తున్నాడు. ఇద్దరూ తెలుగులో ప్రస్తుతం టాప్ హీరోయిన్లు. ఈ ఇద్దరూ ఒకే సినిమాలో కనిపిస్తే ప్రేక్షకులకు పండగే అనడంలో సందేహం లేదు. ఈ చిత్రానికి స్క్రిప్టు ఎప్పుడో పూర్తి కాగా.. దానికి మెరుగులు దిద్దే పని కూడా జరుగుతోంది. పక్కాగా షెడ్యూళ్లు వేసుకుని బన్నీ అందుబాటులోకి రాగానే నాలుగైదు నెలల్లో సినిమాను పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

This post was last modified on August 9, 2021 6:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

44 minutes ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

1 hour ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

1 hour ago

నారా కుటుంబం ప్ర‌జ‌ల సొమ్ము దోచుకోదు: భువ‌నేశ్వ‌రి

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం వెళ్లిన‌.. ఆయ న స‌తీమ‌ణి నారా…

3 hours ago

రివర్స్ గేమ్ ఆడబోతున్న ఉపేంద్ర ?

అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…

3 hours ago

ఆయ‌న సినిమా హీరో అంతే: డీజీపీ

అల్లు అర్జున్‌-పుష్ప‌-2 వివాదంపై తాజాగా తెలంగాణ‌ డీజీపీ జితేంద‌ర్‌ స్పందించారు. ఆయ‌న సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్య‌వ‌హారంపై…

4 hours ago