‘మీటూ’ తర్వాత సినిమా ఇండస్ట్రీని భారీగా ఊపేసిన ఉదంతం ఏదైనా ఉందంటే అది.. బూతు సినిమాల ఉదంతమే. అదిరే చాన్సులు రావాలంటే.. పడక సీన్లు చేస్తే దానంతట అదే ఇమేజ్ వస్తుందని.. పాపులర్ అవుతారన్న మాయ మాటలు నటీమణుల్ని పక్కదారి పట్టేలా చేస్తాయి. బాలీవుడ్ లో బూతు సినిమాలు తీయటంలో టాలెంట్ ఉన్న ప్రముఖుల్లో బాలీవుడ్ నటీమణి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అన్న విషయం బయటకు వచ్చినంతనే షాక్ తినే పరిస్థితి. పేరు ప్రఖ్యాతులకు కొదవ లేని స్టార్ కుటుంబం ఇంతటి నీచానికి పాల్పడుతుందా? అన్న విస్మయం పలువురికి కలిగింది. డబ్బు సంపాదన తప్పించి మరింకేమీ ముఖ్యం కాదన్నప్పుడు ఇంతకు మించి ఇంకేం ఆశించగలమన్న విషయం.. తాజాగా బయటకు వస్తున్న విషయాల్ని చూస్తే.. ఇట్టే అర్థం కాక మానదు.
బూతు సినిమాలు తీస్తున్న రాజ్ కుంద్రాను ఇటీవల ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేయటం.. కోర్టు ఆయన్ను రిమాండ్ కు పంపటం తెలిసిందే. సంచలనంగా మారిన ఈ ఉదంతంపై ముంబయి పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ బూతు సినిమాల్లో భాగమైన కొందరు నటీమణుల్ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా వారిని రాజ్ కుంద్రా ఎలా ట్రాప్ చేస్తారు? వారిని ఎలా ఒప్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. బూతు సినిమాల్లో నటించేందుకు నటీమణులు ఓకే చేసిన తర్వాత. వారితో ఎలాంటి లీగల్ ఇష్యూలు రాకుండా ఉండటం కోసం చేయించుకునే అగ్రిమెంట్ లో ఏముంటుంది? అందులోని అంశాలేమిటి? అన్నది ప్రశ్నలుగా మారాయి. తాజాగా ముంబయి పోలీసులు ఈ విషయానికి సంబంధించిన సమాచారాన్ని రివీల్ చేశారు. చాలామంది నటీమణులకు మంచి బ్రేక్ వస్తుందన్న మాట చెప్పి.. వారి చేత సంతకాలు చేయిస్తారన్న విషయం తమ విచారణలో వెల్లడైందని చెబుతున్నారు.
ఒకవేళ అశ్లీల చిత్రాల్లో నటించకుంటే ఇండస్ట్రీలో బ్రేక్ రాదన్న బెదిరింపునకు వారు ఇట్టే ఓకే చెప్పేసేవారని చెబుతున్నారు. లీగల్ ఇష్యూస్ రాకుండా ఉండేందుకు.. తాము చేసే బూతు సినిమాలకు సంబంధించి నటీమణుల చేత పక్కా డాక్యుమెంటేషన్ చేయిస్తారని చెబుతున్నారు. ఈ డాక్యుమెంట్ లో పలు అంశాల్ని పక్కాగా ప్రస్తావిస్తారని చెబుతున్నారు. అగ్రిమెంట్ లో ఉండే అంశాలేమిటన్న విషయానికి వస్తే.. “శృంగార,అశ్లీల,నగ్న,ముద్దు సన్నివేశాల్లో నటించేందుకు నా ఇష్ట పూర్తిగా నేను అంగీకారం తెలుపుతున్నా” అంటూ విస్పష్టం ఆమోదం తీసుకుంటారని చెబుతున్నారు.
అంతేకాదు.. ఈ విషయంలో నిర్మాణ సంస్థ ఒత్తిడి కానీ.. ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని.. సదరు సీన్లనను ఓటీటీ.. లేదంటే వెబ్ సైట్ లో విడుదల చేసే సినిమా కోసం ఉపయోగించినా ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేయటంతో పాటు.. తానెలాంటి ఆరోపణలు చేయనని కాంట్రాక్టు మీద సంతకం చేయించుకుంటారని చెబుతున్నారు. పక్కాగా ఉండే ఈ అంశాల్ని సైన్ చేసే ముందు నటీమణులు పెద్దగా పట్టించుకోరని చెబుతున్నారు. చాలా తక్కువ మంది మాత్రం తామే అంశాల్ని కమిట్ అవుతున్నామన్న విషయాన్ని మాత్రంజాగ్రత్తగా చెక్ చేసుకుంటారని తెలుస్తోంది.
This post was last modified on August 8, 2021 11:04 am
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…