పోయినేడాది కరోనా ఫస్ట్ వేవ్ బ్రేక్ తర్వాత టాలీవుడ్ బాగానే పుంజుకుంది. రీస్టార్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’తో మంచి ఊపొచ్చింది. యావరేజ్ కంటెంట్‌తోనే ఆ సినిమా అంచనాలకు మించి ఆడేసింది. ఆ తర్వాత సంక్రాంతి సినిమాల సందడి ఎలా సాగిందో తెలిసిందే. ఐతే కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత మాత్రం పరిస్థితులు అంత ఆశాజనకంగా కనిపించడం లేదు.
చిన్న సినిమాలైన తిమ్మరసు, ఇష్క్‌లతో ఈసారి థియేటర్లు పున:ప్రారంభం అయ్యాయి. వీటికి ఆశించినంత బజ్ కనిపించలేదు. సెకండ్ వేవ్ దెబ్బకు అల్లాడిపోయిన జనాలు థియేటర్లకు వచ్చే విషయంలో తటపటాయిస్తున్నట్లే కనిపిస్తోంది.
పైగా క్రేజీ సినిమాలు లేకపోవడం వారి వెనుకంజకు మరో కారణం కావచ్చు. ఐతే ఈ పరిస్థితుల్లోనూ ‘తిమ్మరసు’ ఓ మోస్తరుగానే ఆడుతోంది. ఇది కాస్త ఊరటనిచ్చే విషయం. ఐతే సినీ పరిశ్రమకు అసలైన ఊపు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
ఈ వారం అరడజనుకు పైగా సినిమాలు రిలీజవుతున్నాయి. ముగ్గురు మొనగాళ్లు, ఇప్పుడు కాక ఇంకెప్పుడు, మెరిసే మెరిసే.. ఇలా కొత్త సినిమాలు చాలానే ఈ వారం థియేటర్లలోకి దిగుతున్నాయి. కానీ వాటికి ఏమంత బజ్ లేదు. ఉన్నవాటిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నది ‘రాజా వారు రాణి వారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరపు హీరోగా నటించిన ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ ఒక్కటే. ఈ చిత్రం టీజర్, ట్రైలర్, ఇతర ప్రోమోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. యూత్‌లో ఈ సినిమా పట్ల బాగానే ఆసక్తి కనిపిస్తోంది. దీనికి మంచి ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వస్తున్నారు.
ప్రమోషన్లు కూడా కొంచెం గట్టిగానే చేస్తున్నారు. ఈ చిత్రానికి దగ్గర మంచి ఫలితం వస్తే.. బాక్సాఫీస్ కొంచెం ఊపందుకుంటే ఆ తర్వాత స్టార్ హీరోలు నటించిన టక్ జగదీష్, లవ్ స్టోరి లాంటి మీడియం రేంజ్ చిత్రాలను రిలీజ్ చేయడానికి ధైర్యం వస్తుంది. మరి ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ ఎలాంటి ఫలితాన్నందుకుంటో చూడాలి.
This post was last modified on August 4, 2021 3:10 pm
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
సామాజిక భద్రతా పింఛన్.. ఇది చాలా సునిశితమైన అంశం. ఆర్థికంగా ముడిపడిన వ్యవహారమే అయినా .. అత్యంత సెన్సిటివ్ అంశం.…