ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో శిల్పాశెట్టి ఇమేజ్ పై దెబ్బ పడింది. ఆమె కెరీర్ పై రాజ్ కుంద్రా అరెస్ట్ ఎఫెక్ట్ చూపిస్తోంది. శిల్పా తన ఆదాయాన్ని కోట్లలో కోల్పోతుంది. బుల్లితెరపై ఓ డాన్స్ షోకి ఆమె జడ్జిగా వ్యవహరిస్తోంది. ఎప్పుడైతే రాజ్ కుంద్రాను అరెస్ట్ చేస్తారో అప్పటినుండి ఆమె టీవీ షోలో కనిపించడం లేదు.
ఒక్కో ఎపిసోడ్ కి శిల్పాశెట్టి రూ.18 నుండి రూ.22 లక్షల వరకు ఛార్జ్ చేస్తుంది. కానీ కొన్నిరోజులుగా ఆమె షూటింగ్ కి రావడం లేదు. దీని వలన ఆమె మొత్తంగా రూ.2 కోట్లు నష్టపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. రీసెంట్ గా ఈ డాన్స్ షోకి జడ్జిగా కరిష్మా కపూర్ ఒక ఎపిసోడ్ లో కనిపించింది. ఆ తరువాత జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ లను తీసుకొచ్చారు. అయితే వీరంతా ఒక్కో ఎపిసోడ్ లో కనిపించి వెళ్లిపోయారు.
ఎక్కువ రోజులు ఇలా గెస్ట్ జడ్జిలతో షోని నడిపించలేరు. దీంతో అసలు షోలో శిల్పాశెట్టిని ఉంచాలా..? లేదా అనే విషయంలో ఓ నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. రాజ్ కుంద్రా కేసు ఓ కొలిక్కి వస్తే గానీ శిల్పాశెట్టి బయటకు రాలేదు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. రీసెంట్ గా శిల్పాశెట్టి తన ట్విట్టర్ లో రాజ్ కుంద్రా అరెస్ట్ పై ఓ స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తనపై అసత్య ప్రచారాలు చేయొద్దంటూ మీడియాకు రిక్వెస్ట్ చేసింది.
This post was last modified on August 3, 2021 8:59 am
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…
నెలలో ఒక్కరోజు గ్రామీణ ప్రాంతాలకు రావాలని.. ఇక్కడి వారికి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…