విజయ్ సేతుపతి.. ఇప్పుడు సౌత్ ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న నటుల్లో ఒకడు. తమిళంలో అతడి మేనియా గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు కానీ.. గత కొన్నేళ్లలో వేరే భాషల్లోకి కూడా అతడి క్రేజ్ విస్తరించింది. సేతుపతిని దృష్టిలో ఉంచుకుని పాత్రలు రాయడం.. లేదా తాము రాసిన పాత్రలకు సేతుపతే న్యాయం చేయగలడని అతడి కోసం ప్రయత్నించడం చేస్తున్నారు తెలుగు, ఇతర భాషల ఫిలిం మేకర్స్.
తెలుగులో ఇప్పటికే సైరా, ఉప్పెన చిత్రాల్లో నటించిన సేతుపతిని ‘పుష్ప’లో కూడా నటింపజేయాలని చూశారు కానీ.. అప్పటికి డేట్లు సర్దుబాటు కాక ఈ చిత్రాన్ని ఒప్పుకోలేదు సేతుపతి. ఐతే తెలుగులో మరిందరు డైరెక్టర్లు సేతుపతి కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఓ తెలుగు చిత్రానికి సేతుపతి ఓకే అనేశాడట. అందులో యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరో అని అంటున్నారు.
సందీప్‌తో మంచి అనుబంధం ఉన్న బాలీవుడ్ ఫిలిం మేకర్స్ రాజ్-డీకే.. తెలుగులో ఓ సినిమాకు సమర్పకులుగా వ్యవహరించనున్నారట. ఇంతకుముందు సందీప్‌తోనే ‘డి ఫర్ దోపిడీ’ అనే సినిమాను నిర్మించారు రాజ్-డీకే. అది సరిగా ఆడలేదు. హిందీలో వీళ్లిద్దరూ రూపొందించిన ‘షోర్ ఇన్ ద సిటీ’.. అలాగే ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌లో సందీప్ నటించాడు. ఇప్పుడు సందీప్ హీరోగా వేరే నిర్మాతతో కలిసి తెలుగులో సినిమా తీయబోతున్నారట రాజ్-డీకే. భరత్ చౌదరి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఈ చిత్రంలో సందీప్‌కు విలన్‌గా విజయ్ సేతుపతి నటించనున్నాడట.
సినిమాలో హీరోను మించి హైలైట్ అయ్యేలా విలన్ పాత్ర ఉంటుందని.. దానికి సేతుపతి అయితేనే న్యాయం చేయగలడని అతణ్ని సంప్రదించారని.. తన పాత్ర నచ్చడంతో పాటు మంచి టీం కలిసి చేస్తున్న సినిమా కావడంతో అతను ఓకే అన్నాడని.. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన వస్తుందని సమాచారం.
This post was last modified on August 2, 2021 6:49 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…