ఒక హీరోకు వీరాభిమానిగా ఉండి.. అదే హీరోతో సినిమా తీసే అవకాశం దక్కించుకోవడం అరుదైన విషయం. కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ ఈ కోవకే చెందుతాడు. అతను మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్. గుంటూరు జిల్లా చిరంజీవి అభిమానుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు యుక్త వయసులో.
చిరు స్ఫూర్తితోనే సినిమా రంగంలోకి వచ్చి.. అంచెలంచెలుగా ఎదిగి దర్శకుడిగా మారాడు. రవితేజతో తీసిన సూపర్ హిట్ మూవీ ‘పవర్’తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన అతను.. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ, వెంకీ మామ చిత్రాలను రూపొందించడం తెలిసిందే.
ఇప్పుడు చిరంజీవితో ఓ సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడు. స్క్రిప్టు పూర్తయింది. త్వరలోనే షూటింగ్ కూడా మొదలు కాబోతోంది. ఆదివారం బాబి పుట్టిన రోజు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చిరు సినిమాకు సంబంధించి ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు బాబీ.
ఒక అభిమానికి, ఒక స్టార్‌కు మధ్య అనుబంధమే చిరుతో తాను చేస్తున్న సినిమా కథకి స్ఫూర్తి అని.. ఒక్క మాటలో చెప్పాలంటే చిరునే ఈ సినిమాకు ఇన్‌స్పిరేషన్ అని బాబీ అన్నాడు. ఒక హీరోను ఆరాధించే అభిమాని.. తమ హీరోకు ఎలాంటి ఇంట్రడక్షన్ సీన్ ఉండాలని కోరుకుంటాడో.. ఎలా కనిపిస్తే విజిల్స్ పడతాయని ఆశిస్తాడో చిరుకు సంబంధించి అలాంటి మూమెంట్స్ తన మనసులో చాలా ఏళ్ల నుంచి ఉన్నాయని.. అవే రెండేళ్లుగా సీరియస్‌గా తనతో చిరంజీవి కోసం కథ రాయించాయని బాబీ తెలిపాడు.
తొలిసారి చిరంజీవికి కథ చెబుతున్నప్పుడు చిన్న భయం, బెరుకు, ఆనందం అన్నీ కలగలిసిన అనుభూతి కలిగిందని.. గంటసేపు కథ చెప్పాక ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారని బాబీ వెల్లడించాడు. అభిమానులకి ఏం కావాలో అన్నీ ఈ సినిమాలో ఉంటాయని.. ‘ఘరానా మొగుడు’, ‘గ్యాంగ్‌లీడర్’, ‘రౌడీ అల్లుడు’… ఇలా తాను ఏయే సినిమాలు చూసి విజిల్స్ కొట్టానో అలాగే తాను చిరుతో చేస్తున్న సినిమా ఉంటుందని.. దసరా నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని బాబీ చెప్పాడు.
This post was last modified on August 2, 2021 10:36 am
మాములుగానే రష్మిక మందన్న హైపర్ యాక్టివ్ గా మాట్లాడుతుంది. అది ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా లేక మరో వేదిక…
నిన్న విడుదలైన ఉపేంద్ర యుఐకి విచిత్రమైన టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఇంటెలిజెంట్ మేకింగ్, అర్థం చేసుకున్నోళ్లకు అర్థం చేసుకున్నంత…
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…