ఇండియాలో సూపర్ పాపులర్ అయిన టీవీ రియాలిటీ షోల్లో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ఒకటి. దీన్ని తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరుతో చాలా ఏళ్ల కిందటే మొదలుపెట్టారు. మూడు సీజన్ల పాటు నాగార్జున హోస్ట్‌గా చేస్తే.. తర్వాత చిరంజీవి ఒక సీజన్‌ను నడిపించారు. ఐతే తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది.
అప్పుడు మా టీవీలో ఈ షో ప్రసారం అయితే.. ఇప్పుడు జెమిని టీవీ వాళ్లు దీన్ని టేకప్ చేశారు. ఇప్పుడు షో పేరును ‘ఎవరు మీలో కోటీశ్వరులు’గా మార్చి.. ఎన్టీఆర్ హోస్ట్‌గా కొత్త సీజన్ మొదలు పెడుతున్నారు. వేసవిలోనే షో మొదలు కావాల్సింది కానీ.. కరోనా కారణంగా బ్రేక్ పడింది. సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గాక మళ్లీ పని మొదలుపెట్టారు. కొన్ని ఎపిసోడ్ల షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఆగస్టులోనే ఈ షో ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా కొత్త ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు.
కరోనా కారణంగా జనాల జీవితాలు ఎలా తల్లకిందులయ్యాయో తెలిసిందే. ఆ నేపథ్యాన్నే తీసుకుని ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కొత్త ప్రోమోను ఎమోషనల్‌గా తీర్చిదిద్దారు. కాలేజీలో పాఠాలు చెప్పే ఒక లెక్చరర్ ఉద్యోగం కోల్పోవడం.. ఆ తర్వాత టిఫిన్ కొట్టు పెట్టుకోవడం.. అక్కడ డబ్లుల్లేని పేద విద్యార్థులు కొందరికి ఉచితంగా టిఫిన్ పెట్టడం.. ఆపై ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో పాల్గొని రూ.25 లక్షలు గెలవడం.. ఆ డబ్బు ఏం చేస్తారని ఎన్టీఆర్ అడిగితే సగం డబ్బులు ఫీజులు కట్టలేని విద్యార్థులకు ఇస్తానని.. మిగతా సగం ఇంటి ఖర్చులకు ఉపయోగించుకుంటానని అనడం.. దీనికి ఎన్టీఆర్ శభాష్ అంటూ భుజం తట్టడం.. ఇలా ఎమోషనల్‌గా నడిచింది ప్రోమో.
‘బిగ్ బాస్’ షోను అద్భుతంగా నడిపించి గొప్ప పేరు సంపాదించిన తారక్.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ను కూడా తనదైన వాక్చాతుర్యం, స్పాంటేనిటీతో విజయవంతం చేస్తాడన్న అంచనాలు ఉన్నాయి. చూద్దాం మరి షో ఎలా ఉంటుందో?
This post was last modified on August 1, 2021 6:15 pm
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…