దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇప్పటివరకు తెర వెనుక కనిపించారు. కానీ తొలిసారి నటుడిగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. గౌరీ రోనంకి డైరెక్ట్ చేస్తోన్న ‘పెళ్లి సందD’ సినిమాలో రాఘవేంద్రరావు వశిష్ట అనే సినిమాలో నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాలో ఆయన లుక్ ను రివీల్ చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో రాఘవేంద్రరావుని స్టైలిష్ గెటప్ లో చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సినీ తారలు సైతం రాఘవేంద్రరావుకి విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు.
మెగాస్టార్ చిరంజీవి కూడా నటుడిగా రాఘవేంద్రరావు వెండి తెర మీద కనిపిస్తే.. ఆ వెండితెర కూడా మురిసిపోతుందంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఇదిలా ఉండగా.. రాఘవేంద్రరావు నటుడిగా మారడంతో చిరంజీవిలో ఓ ఆలోచన వచ్చిందట. రాఘవేంద్రరావు ప్రధాన పాత్రలో మెగాస్టార్ ఓ సినిమా డైరెక్ట్ చేయాలనుకున్నారట. ఇదే విషయాన్ని రాఘవేంద్రరావుకి చెప్పారట.
ఈ విషయాలను స్వయంగా చిరంజీవి చెప్పుకొచ్చారు. రీసెంట్ కొందరు మీడియా సభ్యులతో ఇంటరాక్ట్ అయిన చిరు.. రాఘవేంద్రరావుతో జరిగిన సంభాషణను చెప్పుకొచ్చారు. చిరు తనను డైరెక్ట్ చేస్తానని చెప్పగానే.. రాఘవేంద్రరావు ‘నాకు ఇప్పుడే టెన్షన్ స్టార్ట్ అయింది’ అంటూ బదులిచ్చారట. నిజంగానే ఈ కాంబినేషన్ గనుక సెట్ అయితే సినీ అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరుగుతుంది.
This post was last modified on August 1, 2021 11:56 am
ప్రస్తుతం మనలో చాలామంది తెలిసో తెలియకో ఇబ్బంది పడే సమస్యలలో యూరిక్ యాసిడ్ పెరుగుదల కూడా ఒకటి. చలికాలంలో ఈ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…