కొందరు దర్శకుల సినిమాలను చూస్తే వారిలో విషయం ఉన్నట్లే అనిపిస్తుంది. ఏదో కొత్తగా చేయాలనే తపనా కనిపిస్తుంది. కానీ తాము ఎంచుకున్న కథలను సరిగా చెప్పలేక ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటూ ఉంటారు. అనిల్ కృష్ణ కన్నెగంటి అనే యువ దర్శకుడి పరిస్థితి ఇదే.
అతను దశాబ్దంన్నర కిందట అసాధ్యుడు అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అతనొక్కడే చిత్రంతో బ్లాక్‌బస్టర్ కొట్టి ఊపుమీదున్న నందమూరి కళ్యాణ్ రామ్.. దాని తర్వాత చేసిన చిత్రమిదే. మంచి హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. కథ కొంచెం భిన్నమైనదే అయినా ట్రీట్మెంట్ సరిగా లేక ఆ సినిమా ఆడలేదు. ఆ తర్వాత కొన్నేళ్ల విరామం తర్వాత మంచు మనోజ్ హీరోగా మిస్టర్ నూకయ్య అనే మరో వెరైటీ సినిమా తీశాడు అనిల్. ఆ చిత్రానికి విడుదల ముంగిట మాంచి హైప్ వచ్చింది కానీ.. అది కూడా సరిగా ఆడలేదు. మళ్లీ అనిల్ కెరీర్లో గ్యాప్ వచ్చింది.
ఈసారి తమిళ హిట్ నేరమ్‌ను రన్ పేరుతో రీమేక్ చేశాడు. సందీప్ కిషన్ హీరో. అది ఇంకా పెద్ద డిజాస్టర్ అయింది. అనిల్ కెరీర్‌కు ఈసారి మరింత బ్రేక్ పడింది. టాలీవుడ్లో ఆ దర్శకుడి ఉనికి ప్రశ్నార్థకమైపోయింది. ఇక మళ్లీ కనిపించడనుకున్న దర్శకుడు ఇప్పుడో కొత్త చిత్రంతో వస్తున్నాడు. యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకాకర్ తమ్ముడు అశ్విన్ బాబు ఇందులో హీరోగా నటిస్తున్నాడు.
ఎక్కువగా అన్నతోనే సినిమాలు చేసిన అశ్విన్.. బయట ఫుల్ లెంగ్త్ హీరోగా చేస్తున్న సినిమా ఇది. దీని ప్రి లుక్ చూస్తే యాక్షన్ ఎంటర్టైనర్ లాగా అనిపిస్తోంది. ఈసారి సొంత కథతోనే వస్తున్నాడు అనిల్. సినిమా సినిమాకూ తగ్గుతూ వచ్చిన అతడి రేంజ్.. ఈ చిత్రం తర్వాత ఏమవుతుందో చూడాలి. ఈసారి హిట్టు కొట్టకపోతే అనిల్ ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం కావడం ఖాయం.
This post was last modified on August 1, 2021 5:50 am
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…