మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇది పూర్తి కాగానే ‘లూసిఫర్’ సినిమా రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకున్న సంగతి తెలిసిందే.
కరోనా ఎఫెక్ట్ గనుక లేకపోతే ఈపాటికే సినిమా షూటింగ్ మొదలయ్యేది. కానీ సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటివరకు సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. పైగా ఈ సినిమా స్క్రిప్ట్ చాలా మంది దర్శకుల వద్ద నలిగి నలిగి ఫైనల్ గా మోహన్ రాజా చేతికి వచ్చింది. అది కూడా ఈ సినిమా ఆలస్యం కావడం ఓ రీజన్.
ఇప్పుడు ‘ఆచార్య’ సినిమా ఓ కొలిక్కి రావడంతో చిరు ‘లూసిఫర్’ రీమేక్ పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఆగస్టు 13 నుండి మొదలుపెట్టాలని ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారట. ఆగస్టు 13న షూటింగ్ మొదలుపెట్టి గ్యాప్ లేకుండా నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తవుతుంది.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన భారీ సెట్ ను నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఆర్ట్ డైరెక్టర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక ఒరిజినల్ వెర్షన్ లో మంజు వారియర్ పోషించిన పాత్రలో నయనతార కనిపించనుందని అంటున్నారు. అలానే మరికొంతమంది టాలెంటెడ్ ఆర్టిస్ట్ లను తీసుకున్నట్లు తెలుస్తోంది. కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
This post was last modified on July 29, 2021 8:46 am
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…