ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి.. తన నటనతో ప్రేక్షకుల మనసుల్ని దోయటమే కాదు..తన సినిమా ఒకటి వస్తుందంటే చాలు.. అందులో సమ్ థింగ్ ఉంటుందన్న ఫీల్ కలిగించటంలో సక్సెస్ అయ్యారు. తాజాగా తిమ్మరసు టీంతో కలిసి పాల్గొన్న కార్యక్రమంలో ఆయన సినిమాల కంటే కూడా.. థియేటర్ల గురించి చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయి. టాలీవుడ్ లో ఇంత మంది నటులు ఉన్నారు కానీ ఎవరూ చెప్పలేనంత ఎఫెక్టివ్ గా థియేటర్లలో సినిమాను ఎందుకు చూడాలో చెప్పేశారని చెప్పాలి.
కరోనా దెబ్బకు థియేటర్లను మూసేయటం.. మరోసారి తెరిచినప్పటికీ సెకండ్ వేవ్ కారణంగా మరోసారి సినిమా థియేటర్లను మూసేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ లాక్ లో భాగంగా థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చంటూ పర్మిషన్ ఇచ్చినప్పటికీ సినిమా థియేటర్లు ఓపెన్ కాలేదు. విపరీతమైన తర్జన భర్జన అనంతరం థియేటర్లను ఈ నెల 30నుంచి ఓపెన్ చేయాలని డిసైడ్ కావటం తెలిసిందే.
సెకండ్ వేవ్ అనంతరం ఓపెన్ అవుతున్న థియేటర్లలో చిన్న హీరోలు నటించిన సినిమాలు విడుదల కానున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి సత్యదేవ్ నటించిన తిమ్మరసు. దీనికి సంబంధించిన ఒక ప్రోగ్రాంను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన హీరో నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థియేటర్లలో సినిమాలు చూడాలన్న కాన్సెప్టును విజయవంతంగా చెప్పారని చెప్పాలి.
ఆయన ఏమన్నారంటే.. ‘కరోనా వేళ అన్నింటికంటే ముందు థియేటర్లు మూస్తారు. అన్నింటి కంటే చివరన థియేటర్లు తెరుస్తారు. బయట ఉండే ఇతర ప్రదేశాల కంటే థియేటర్ చాలా సురక్షితం. ఒకరితో ఒకరం మాట్లాడుకోం. మాస్కులు వేసుకొని సినిమా చూస్తాం’’ వ్యాఖ్యానించారు. థియేటర్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ అని.. దాని మీద చాలామంది ఆధారపడి ఉంటారన్నారు.
థియేటర్ల మూసి ఉంచటం చాలా చిన్న సమస్యగా తోస్తుంది కానీ.. ఇది చాలా పెద్ద సమస్య అని అన్నారు. పరిస్థితులు చక్కబడకుంటే మన తర్వాతి తరం థియేటర్స్ అనుభూతిని మిస్ అవుతారన్నారు. తిమ్మరుసు.. ఈ నెల 30న విడుదలయ్యే సినిమాలకు ఆక్సిజన్ కావాలన్ననాని.. తన కుటుంబంతో కలిసి సినిమాను చూస్తానని పేర్కొన్నారు. మొత్తానికి తిమ్మరుసు కార్యక్రమానికి వచ్చి.. థియేటర్లలో సినిమాల్ని చూడాలన్న ప్రమోషన్ ను విజయవంతంగా పూర్తి చేశారని చెప్పాలి.
This post was last modified on %s = human-readable time difference 11:28 am
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…
ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో లోకేష్ కనకరాజ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అతడి వల్లే సినిమాటిక్ యూనివర్శ్…