‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ భామ నభా నటేష్. తొలి చిత్రంలో పూర్తి సంప్రదాయ బద్ధంగా కనిపించిన ఈ భామ.. ఆ తర్వాత మాత్రం దానికి భిన్నమైన పాత్రలు, లుక్స్‌తో తన ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసుకుంది. ముఖ్యంగా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో నభా అందాల ప్రదర్శనతో కుర్రాళ్లకు ఎలా కాక పుట్టించిందో తెలిసిందే. ఈ సినిమా తర్వాత టాలీవుడ్లో ఫుల్ బిజీ అయిపోయిందీ భామ.
డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో.. ఇలా వరుసగా సినిమాలు చేసుకుపోతోంది. ‘అల్లుడు అదుర్స్’లో సూపర్ సెక్సీగా కనిపించిన ఈ భామ.. ‘మాస్ట్రో’లోనూ గ్లామర్ టచ్ ఉన్న క్యారెక్టరే చేస్తోంది. సినిమాల్లో చేసే అందాల విందుకు తోడు ఫొటో షూట్లతో కుర్రాళ్లను కవ్వించడం కూడా నభాకు బాగానే అలవాటు.
ఈ కోవలోనే నభా కొత్త షూట్ ఇప్పుడు ‘హాట్’ టాపిక్ అవుతోంది. నియోన్ బ్యాక్‌డ్రాప్‌లో ఎల్లో సూట్ వేసుకుని నభా చేసిన అందాల విందుకు రసిక ప్రియులు ఫిదా అయిపోతున్నారు. హాట్ లుక్స్‌కు తోడు.. నభా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ కిరాక్ అనిపించేలా ఉన్నాయి. ఈ సూపర్ స్టైలిష్, హాట్ ఫొటో షూట్‌కు సంబంధించిన పిక్స్ ట్విట్టర్లోకి రావడం వైరల్ అయిపోయాయి.
ఇక నభా కెరీర్ విషయానికొస్తే ఆమె లేటెస్ట్ మూవీ ‘మాస్ట్రో’ ఇంకో రెండు వారాల్లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందంటున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ చిత్రాన్ని హాట్ స్టార్ నేరుగా రిలీజ్ చేయబోతోంది. దీని మాతృక ‘అంధాదున్’లో రాధికా ఆప్టే చేసిన పాత్రలో నభా కనిపించనుంది. ఇందులో మరో గ్లామర్ తార తమన్నా కూడా నటిస్తోంది. ఆమె ముందు నభా తన ప్రత్యేకతను ఎలా చాటుకుంటుందో చూడాలి.
This post was last modified on July 27, 2021 3:57 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…