పాక్ పీఎం పదవిపై దావూద్ గర్ల్ ఫ్రెండ్ కన్ను..!

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గర్ల్ ఫ్రెండ్ అంటూ రూమర్స్ వినిపించే.. పాకిస్తాన్ నటి మోహ్విష్ హయత్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె కన్ను ప్రస్తుతం పాకిస్తాన్ పీఎం పదవిపై పడింది. ఏదో ఒకరోజు తాను కచ్చితంగా పకిస్తాన్ ప్రధానిని అయ్యి తీరతానని ఆమె చెప్పడం గమనార్హం.

ఓ ఛానల్ కు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మెహ్విష్ ఈ వ్యాఖ్యలు చేసింది. తనకు ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖానే ను ఇన్స్పిరేషన్ అని తెలిపింది. రాజకీయాలకు రాకముందు ఇమ్రాన్ ఒక క్రికెటర్.. మరి.. క్రికెటర్ ప్రధాని అయినప్పుడు సినీనటులు ఎందుకు కాకూడదని ప్రశ్నించింది.

కచ్చితంగా ప్రధాని పదవికి పోటీ చేస్తానని తెలిపింది మెహ్విష్ హయత్. అయితే తాను ఇమ్రాన్ ఖాన్ ను ఛాలెంజ్ చేయాలనుకోవడం లేదని.. ఇంకెవరైనా ఆ స్థానానికి పోటీ చేయాలనుకుంటే అప్పుడు తాను కూడా బరిలో ఉంటానని చెప్పుకొచ్చింది.

కాగా.. మోహ్విష్.. తనకన్నా వయసులో 27ఏళ్లు పెద్దవాడైన దావూద్ తో రిలేషన్ లో ఉందంటూ రూమర్స్ ఉన్నాయి. ఓ ఐటెం సాంగ్ లో ఆమెను చూసి దావూద్ ఫిదా అయ్యాడని.. అప్పటి నుంచే మెహ్విష్ కు పెద్దపెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయని టాక్. ఈ నేపథ్యంలో తాను పాక్ ప్రధాని అవుతానంటూ ఆమె కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారాయి.