టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్, తెలుగువాడే అయిన బాలీవుడ్ ప్రొడ్యూసర్ మధు మంతెన కలిసి రామాయణ గాథ నేపథ్యంలో ఓ భారీ చిత్రం తీయడానికి కొన్నేళ్ల కిందట సన్నాహాలు మొదులపెట్టిన సంగతి తెలిసిందే. వీరి నిర్మాణంలో దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్లో రామాయణం సినిమా వస్తుందని కొన్నేళ్ల కిందటే ప్రకటన వచ్చింది. కానీ ఆ సినిమా పట్టాలెక్కడంలో ఆలస్యం జరుగుతోంది.
ఐతే ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించడానికి చూస్తున్నారు. ఇందులో కాస్టింగ్ గురించి ఇప్పటికే కొన్ని ఊహాగానాలు నడిచాయి. ఐతే నిర్మాతల్లో ఒకరైన మధు మంతెన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చాడు. దసరాకు ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూను వెల్లడించనున్నట్లు ప్రకటించాడు. ఇక అప్పట్నుంచి ఈ సినిమాలో ముఖ్య తారాగణం గురించి ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.
ప్రస్తుతానికి హృతిక్ రోషన్, దీపికా పదుకొనే ఈ రామాయణం సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఓ కీలక పాత్ర చేస్తాడని ముందు నుంచి ఊహాగానాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఐతే తాజా సమాచారం ప్రకారం మహేష్ ఈ సినిమాకు నో చెప్పేశాడట.
అతణ్ని ఈ సినిమాకు సంప్రదించడం వాస్తవమే అని.. ఐతే ఈ చిత్రానికి బల్క్ డేట్లు ఇవ్వాల్సి ఉండటం, రాజమౌళితో చేయాల్సిన సినిమాతో క్లాష్ అయ్యే అవకాశం ఉండటంతో మహేష్ ఈ ప్రాజెక్టును అంగీకరించలేని స్థితిలో పడ్డాడని జోరుగా ప్రచారం సాగుతోంది. మహేష్ నో చెప్పేయడంతో సౌత్ నుంచే మరో స్టార్ హీరోతో ఈ పాత్ర చేయించాలని చూస్తున్నారట మేకర్స్. దంగల్ దర్శకుడు నితీశ్ తివారి దర్శకత్వంలో ఈ మెగా మూవీ తెరకెక్కనుంది. మహేష్-రాజమౌళి చిత్రాన్ని వచ్చే ఏడాది ఆరంభంలో మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
This post was last modified on July 27, 2021 12:09 pm
మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…