విరాన్ ముత్తంశెట్టి.. టాలీవుడ్లోకి అడుగు పెడుతున్న కొత్త హీరో. మామూలుగా చూస్తే ఇదేమంత విషయం కాదు. కానీ ఈ యంగ్ హీరో వెనుక ఉన్నది ఎవరో తెలిస్తే ఆసక్తి కలుగుతుంది. అల్లు అర్జున్‌కు ఈ కుర్రాడు కజిన్ అవుతాడు. చాలా దగ్గరి చుట్టమేనట. ప్రస్తుతం బన్నీ నటిస్తున్న భారీ చిత్రం ‘పుష్ప’ పోస్టర్ల మీద చూస్తే ‘ముత్తంశెట్టి మీడియా’ అనే పేరు కనిపిస్తుంది. ఇది విరాన్ కుటుంబ సంస్థే. తన సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం ఇచ్చాడంటే బన్నీకి వీళ్లెంత దగ్గరివాళ్లో అర్థం చేసుకోవచ్చు.
విరాన్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా.. బతుకు బస్టాండ్. ఐఎన్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ రోజే ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేశారు. అది చూస్తే సినిమా కథేంటో అంతగా అర్థం కాలేదు. హీరో అమ్మాయిల చుట్టూ తిరిగే జులాయి కుర్రాడిలా కనిపిస్తున్నాడు. ఆవారాగా తిరిగే అతను అనుకోకుండా ఓ సమస్యలో చిక్కుకోవడం.. అతణ్ని రౌడీ బ్యాచ్‌లు వెంటాడటం.. వాళ్లను అతను ఢీకొట్టడం లాంటి సన్నివేశాలు కనిపించాయి ట్రైలర్లో.
విరాన్ లుక్స్ పరంగా చాలా యావరేజ్‌గా ఉన్నాడు. యాక్టింగ్ స్కిల్స్ కూడా పెద్దగా కనిపించలేదు. ట్రైలర్లో వావ్ అనిపించే అంశాలు ఏమీ కనిపించలేదు. తమిళ నటుడు మైమ్ గోపి ఇందులో ఓ కీలక పాత్ర చేశాడు. మిగతా ఆర్టిస్టులందరూ అంతగా పేరు లేని వాళ్లే. ట్రైలర్ మొత్తంలో ఆసక్తికరంగా అనిపించింది లాస్ట్ పంచే. “బతుకు బస్టాండా.. ఎవరిది ప్రొడ్యూసర్‌దా.. డైరెక్టర్‌దా” అని ఓ వ్యక్తి హీరోను అడిగితే.. “సినిమా చూసి టైటిల్ కరెక్టో కాదు అప్పుడు చెప్పు” అని విరాన్ బదులివ్వడం కనిపించింది. టైటిల్ చూసి జనాలు తనపై ఈ పంచ్ వేస్తారేమో అనిపించి.. తనపై తనే ట్రైలర్లో కౌంటర్ వేసుకున్నట్లుగా ఉందీ కుర్రాడు. మరి బన్నీ కజిన్‌కు ఈ సినిమా టాలీవుడ్లో ఎలాంటి ఆరంభం ఇస్తుందో చూడాలి.
This post was last modified on July 23, 2021 6:03 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…