ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి పోలీసులకు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వినపడుతున్నాయి.
రాజ్ కుంద్రా పై ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కేసు నమోదు కాగా.. ఇప్పటి వరకు రాజ్ కుంద్రాను అరెస్టు చేయకపోవడానికి కారణమేంటా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే రాజ్ కుంద్రా.. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి పోలీసులకు రూ.25లక్షల వరకు లంచం ఇచ్చారట. అందుకే ఇంత కాలం అరెస్టు చేయలదనే ఆరోపణలు వినపడుతున్నాయి.
ముంబైలోని అవినీతి శాఖ అధికారులకు యాష్ ఠాకూర్ అనే వ్యక్తి మెయిల్ ద్వారా తెలిపాడని అంటున్నారు. కాగా.. ఈ విషయంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. రాజ్ కుంద్రా మాత్రం తానేమీ తప్పు చేయలేదని, కావాలని నన్ను ఇందులో ఇరికిస్తున్నారని వాదిస్తున్నాడు.
పోర్న్ చిత్రాల రాకెట్ విషయంలో ప్రధాన సూత్రధారి రాజ్ కుంద్రా అని పోలీసులు అంటున్నారు. ముంబై క్రైమ్ బ్రాంచి పోలీసులకు లంచం ఇచ్చాడన్న ఆరోపణలపై ఎవరూ నోరు మెదపడం లేదు.
This post was last modified on July 22, 2021 4:19 pm
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…
త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన…