కొందరు హీరోయిన్ల కెరీర్ అంతుచిక్కని విధంగా సాగుతుంటుంది. ఉన్నట్లుండి రైజ్ అవుతారు. ఉన్నట్లుండి డౌన్ అయిపోతారు. రాశి ఖన్నా ఈ కోవకే చెందుతుంది. ‘ఊహలు గుసగుసలాడే’ లాంటి హిట్ మూవీతో కథానాయికగా పరిచయం అయిన రాశి.. ఆ తర్వాత మరికొన్ని విజయాలందుకుని జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, రామ్ లాంటి స్టార్ హీరోలతో జత కట్టింది.
‘తొలి ప్రేమ’ చిత్రంతో నటిగా కూడా మంచి పేరు సంపాదించిన రాశి.. కథానాయికగా మరో స్థాయికి వెళ్తుందని అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా తర్వాత ఆమె కెరీర్ డౌన్ అయిపోయింది. తెలుగులో సినిమాలు లేవని కాదు కానీ.. ఆమె ఇక్కడ ఉండాల్సిన స్థాయిలో అయితే లేదు. ఐతే ఇదే సమయంలో తమిళంలో రాశి మంచి మంచి అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుండటం విశేషం. కోలీవుడ్లో ఒకేసారి నాలుగు చిత్రాల్లో నటిస్తోంది ఈ ఢిల్లీ భామ. అందులో ‘ఆరణ్మయి-3’ ఒకటి.
సీనియర్ దర్శకుడు సుందర్ హార్రర్ కామెడీ జానర్లో రూపొందించిన ఆరణ్మయి, ఆరణ్మయి-2 మంచి విజయమే సాధించాయి. ఇవి రెండూ తెలుగులోకి కూడా అనువాదం అయ్యాయి. ఇప్పుడు ఈ సిరీస్‌లో రానున్న మూడో చిత్రం ఆరణ్మయి-3. గత రెండు చిత్రాల్లో హన్సిక, త్రిష ముఖ్య పాత్రలు పోషిస్తే.. ఇందులో రాశికి లీడ్ రోల్ ఇచ్చాడు సుందర్. ఆమెకు జోడీగా ఆర్య నటిస్తున్నాడు.
ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సెప్టెంబర్లో రిలీజ్ అంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమా నుంచి కొన్ని ఆన్ లొకేషన్ స్టిల్స్ వదిలారు. అందులో ఒక పాటకు సంబంధించిన స్టిల్స్ కూడా ఉన్నాయి. ఆర్యతో కలిసి మాస్ డ్యాన్స్ చేస్తున్న రాశి నావెల్ షోతో కుర్రాళ్లకు కిక్కెక్కిస్తోంది రాశి. తెలుగులో రాశి ఇంత మాస్‌గా, సెక్సీగా కనిపించింది లేదు. సుందర్.. హీరోయిన్లను మాస్‌కు మెచ్చేలా సెక్సీగా చూపిస్తుంటాడు. రాశి అందాలను కూడా అలాగే ఎలివేట్ చేసినట్లున్నాడు.
This post was last modified on July 22, 2021 2:17 pm
తన పాటల కాపీ రైట్స్ విషయంలో ఇళయరాజా చేస్తున్న పోరాటం మరొకరికి ఆదాయం అవుతోంది. అదెలాగో చూడండి. ఇంతకు ముందు…
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కానీ ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి మాత్రం తన తెలివితేటలతో ఒక స్కామర్‌ని…
గ్లామర్ షో చేయకుండా నటననే నమ్ముకుని హీరోయిన్ గా నెగ్గుకురావడం చాలా కష్టం. రెగ్యులర్ పాత్రలకు దూరంగా ఉంటానంటే కెరీర్…
హైదరాబాద్, బెంగళూరు ఎయిర్‌పోర్టుల్లో సీన్ చూస్తే గందరగోళంగా ఉంది. ప్యాసింజర్లు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు, ఇండిగో కౌంటర్ల ముందు…
ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై వైసీపీ అధినేత జగన్…
కోలీవుడ్ లో నిన్నటిదాకా ఎక్కువ వినిపించిన పేరు అనిరుధ్ రవిచందర్. అయితే కూలితో సహా తన వరస సినిమాలు ఆశించిన…