నందమూరి బాలకృష్ణ మీడియా ముందుకు వచ్చాడంటే చాలు.. రచ్చ రచ్చ అవ్వాల్సిందే. ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేసి వార్తల్లోకి ఎక్కేస్తాడు బాలయ్య. మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చేటపుడు ఆయనకు నియంత్రణ ఉండదు. కొన్నిసార్లు నోటికి ఎంత మాటొస్తే అంత మాట అనేసి వివాదానికి తెర తీస్తుంటారు. గత నెల తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావడంపై, ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వకపోవడంపై బాలయ్య చేసిన కామెంట్లు ఎంత దుమారం రేపాయో తెలిసిందే.
ఇప్పుడు సంబంధం లేని విషయంలో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ పేరు తీసుకురావడం ద్వారా బాలయ్య కాంట్రవర్శీకి తావిచ్చాడు. ‘ఆదిత్య 369’ సినిమా విడుదలై 30 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం ఎంత ప్లస్ అయిందో చెప్పుకొచ్చాడు బాలయ్య.
ఐతే ఇళయరాజా గొప్పదనం గురించి చెబుతూ చెబుతూ.. సంగీత దర్శకులకు ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది అని పేర్కొన్న బాలయ్య.. ఉన్నట్లుండి రెహమాన్ పేరెత్తాడు. ఎత్తినవాడు ఊరుకుండక.. రెహమాన్ ఎవరో నాకు తెలియదు అన్నాడు. అంతే కాక అతను పదేళ్లకో హిట్టు ఇస్తాడు.. ఏదో ఆస్కార్ అవార్డు వస్తుంది అంటూ సంబంధం లేని కామెంట్ కూడా చేశాడు బాలయ్య. ఐతే ఇళయరాజాను పొగడ్డం ఏమో కానీ.. ఆయన తర్వాత అంత గొప్ప పేరు సంపాదించి, ప్రపంచ స్థాయికి ఎదిగిన రెహమాన్ లాంటి దిగ్గజాన్ని తక్కువ చేసి మాట్లాడటం ఎందుకో బాలయ్యకే తెలియాలి.
రెహమాన్ ఎవరో తెలియదంటూ బాలయ్య చేసిన కామెంట్ తమిళులకే కాదు.. మన వాళ్లు కూడా చాలామందికి రుచించలేదు. దీంతో #Whoisbalakrishna అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి నెటిజన్లు బాలయ్యను ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్నారు. దీనికి కౌంటర్‌గా బాలయ్య అభిమానులు కూడా స్పందిస్తున్నారు.
This post was last modified on July 22, 2021 2:08 pm
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…