బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్నారు. ఇందులో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ‘పించ్’ అనే టాక్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ షోకి సంబంధించిన కొత్త సీజన్ మొదలైంది. దీని మొదటి ఎపిసోడ్ తాజాగా టెలికాస్ట్ చేశారు. సోషల్ మీడియాలో తమపై వచ్చిన ట్రోల్స్ గురించి సెలబ్రిటీలతో మాట్లాడించడమే ఈ షో మెయిన్ కాన్సెప్ట్.
ఈ షోకి అతిథిగా తన సోదరుడు సల్మాన్ ఖాన్ ను తీసుకొచ్చారు అర్భాజ్ ఖాన్. ఈ సందర్భంగా సల్మాన్ తన వ్యక్తిగత జీవితం, సినిమాల గురించి మాట్లాడారు. ఇదే సమయంలో ఓ నెటిజన్ సల్మాన్ ను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ ను చదివి వినిపించారు అర్భాజ్. సల్మాన్ కు దుబాయ్ లో నూర్ అనే భార్య, 17 ఏళ్ల కూతురు ఉందని ఆరోపిస్తూ సదరు నెటిజన్ చేసిన పోస్ట్ ను ప్రస్తావిస్తూ నిజమేనా..? అని ప్రశ్నించారు అర్భాజ్. దీనిపై స్పందించిన సల్మాన్.. వీరందరికీ ఇలాంటి తప్పుడు సమాచారం ఎలా అందుతుందో గానీ ఇవి నాకు సంబంధం లేని విషయాలు అని అన్నారు.
వారు ఎవరి గురించి మాట్లాడుతున్నారో తనకు తెలియదని.. తనకు భార్య, బిడ్డలు లేరని స్పష్టం చేశారు. తనకు తొమ్మిదేళ్ల వయసున్నప్పటి నుండి ఇండియాలోనే గెలాక్సీ అపార్ట్మెంట్ లో జీవిస్తున్నట్లు.. ఈ విషయం అందరికీ తెలుసని అన్నారు. మరో నెటిజన్ సల్మాన్ మంచివాడిలా నటిస్తుంటాడని ఆరోపించారు. దీనిపై రియాక్ట్ అయిన సల్మాన్.. ”ఒకవేళ తన భార్య నన్ను పొగడ్తలతో ముంచెత్తి ఉండాలి లేదా తన కూతురు నా సినిమా చూపించాలని పట్టుబట్టి ఉంటుందని” సరదాగా అన్నారు.
This post was last modified on July 22, 2021 7:10 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…