‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తరువాత హీరోయిన్ గా తనకు అవకాశాలు పెరుగుతాయని భావించింది నభా నటేష్. కానీ అలా జరగలేదు. ఆమె నటించిన ‘డిస్కో రాజా’, ‘అల్లుడు అదుర్స్’ లాంటి సినిమాలు నభాకి నిరాశనే మిగిల్చాయి. దీంతో ఆమె డీలా పడింది. అవకాశాలు కూడా తగ్గాయి. కానీ ఏదైనా ఆఫర్ తన దగ్గరకు వచ్చిందంటే వెంటనే ఓకే చెప్పేస్తూ ఇండస్ట్రీలో మరికొన్ని రోజులు బండి లాగించే ప్రయత్నం చేస్తోంది.
ప్రస్తుతం ఆమె నితిన్ నటిస్తోన్న ‘మాస్ట్రో’ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయితే తనకు మంచి పేరొస్తుందని ఆమె భావించింది కానీ ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దీంతో నభా సరైన అవకాశం కోసం ఎదురుచూస్తుంది. ఇప్పుడు ఈ బ్యూటీను వెతుక్కుంటూ ఓ సినిమా ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.
గోపీచంద్ హీరోగా దర్శకుడు శ్రీవాస్ ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటేష్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. కానీ నభాను తీసుకోవడం వలన సినిమాకు ఎంతవరకు కలిసొస్తుందనే ఆలోచనలో పడ్డారు నిర్మాతలు. కానీ తెరపై ఈ కాంబో కొత్తగా ఉంటుందని భావిస్తున్నారు. గోపీచంద్ గనుక ఈ విషయంలో నభాకు ఓటేస్తే ఆమెని తీసుకోవడం ఖాయం. మరి ఈ హ్యాండ్సమ్ హీరో.. నభాకు ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి!
This post was last modified on July 21, 2021 11:09 am
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…