ప్రపంచంలో ఏ విషయం తీసుకున్నా అందులో తామే బెస్ట్ అనుకుంటుంటారు తమిళ జనాలు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ఉండొచ్చు కానీ.. ఏం చేసినా తమదే గొప్ప అనుకోవడం అతే అవుతుంది. సినిమాల విషయానికి వస్తే.. ఇండియాలో తమకంటే ఉత్తమంగా ఎవరూ సినిమాలు తీయలేరని, తమ వాళ్ల కంటే ఎవరూ గొప్పగా నటించలేరని వాళ్ల ఫీలింగ్.
ఒక టైంలో తమిళం నుంచి గొప్ప గొప్ప సినిమాలు రావడం, ఎన్నో ప్రయోగాలు జరగడం వాస్తవం. అక్కడి నుంచి కమల్ హాసన్ లాంటి గొప్ప నటులూ వచ్చారు. కానీ కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు కదా? గత కొన్నేళ్లలో తమిళ సినిమాల క్వాలిటీ బాగా పడిపోయింది. అక్కడ ప్రయోగాలు ఆగిపోయాయి. ఎప్పుడో కానీ మంచి సినిమాలు రావట్లేదు. అదే సమయంలో తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి ఎదిగింది. మన సినిమాల మార్కెట్టూ విస్తరించింది. కానీ ఈ విషయాన్ని అంగీకరించడానికి అరవ జనాల మనసులు అంగీకరించవు.
కింద పడ్డా తమదే పైచేయి అన్నట్లు ఇప్పటికీ తమ సినిమాలే గొప్ప, తమ నటులే మేటి అని ఫీలవుతుంటారు. అవతలి వాళ్లను తక్కువ చేసే ప్రయత్నం చేస్తుంటారు. గత కొన్నేళ్లలో తమిళంలో వచ్చిన గొప్ప సినిమాల్లో ‘అసురన్’ ఒకటి. వెట్రిమారన్ ఆ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాడు. లీడ్ రోల్‌లో ధనుష్ గొప్పగా నటించాడు. కాదనలేం. ఐతే ఈ సినిమాను వెంకటేష్ హీరోగా రీమేక్ చేస్తున్నారనగానే అరవ అభిమానుల అతి మొదలైంది.
ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైనపుడు ధనుష్ ముందు వెంకీ తేలిపోయాడంటూ ట్రోల్ చేశారు. నిజానికి నారప్ప లుక్ వెంకీకి బాగా సూటయింది. ఫస్ట్ లుక్స్‌లో ఆయన చాలా బాగా కనిపించారు. అయినా సరే.. తమిళ అభిమానులు ఆయన్ని ట్రోల్ చేశారు. దీనికి మన నెటిజన్లు దీటుగానే బదులిచ్చారు. కట్ చేస్తే ఇప్పుడు ‘నారప్ప’ విడుదలైంది. సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. వయసు మళ్లిన పాత్రలో వెంకీ చాలా బాగా చేశాడు కానీ.. ఫ్లాష్ బ్యాక్‌లో యువకుడి పాత్రలో మిస్ ఫిట్ అయ్యాడు. ఫ్లాష్ బ్యాక్ కూడా అంతగా పండలేదు.
ఇంకేముంది అరవ జనాల అతి మొదలైపోయింది. అక్కడి జర్నలిస్టులతో పాటు మామూలు జనాలు కూడా వెంకీని ట్రోల్ చేస్తున్నారు. ధనుష్ మందు వెంకీ నిలవలేడంటున్నారు. ఐతే ఆహార్యం దృష్ట్యా యువకుడి పాత్రలో వెంకీ కొంత మిస్ ఫిట్ అనిపించి ఉండొచ్చు. అంతమాత్రాన ధనుష్‌తో పోల్చి వెంకీని తక్కువ చేయడమేంటి? ఇక్కడో కీలకమైన విషయం ఏంటంటే.. అప్పట్లో వెంకీ నటించిన ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాన్ని ధనుష్ హీరోగా రీమేక్ చేస్తే.. వెంకీ ముందు అతను తేలిపోయాడు. వెంకీ పెర్ఫామెన్స్‌ను ఏమాత్రం మ్యాచ్ చేయలేకపోయాడు.
కానీ అప్పుడు మనోళ్లేమీ ధనుష్‌ను ట్రోల్ చేయలేదు. ధనుష్ ఎంత మంచి నటుడో మన వాళ్లకూ తెలుసు. ఒక హిట్ సినిమాను రీమేక్ చేసినపుడు ఒరిజినల్లో నటించిన నటుడే ‘బెస్ట్’ అనిపించడం సహజం. అంతమాత్రాన రీమేక్‌లో నటించిన నటుడిని కించపరిచేలా మాట్లాడటం సమంజసం కాదు. కానీ అరవ అభిమానులు ఈ ఇంగితం లేకుండా.. తన వంతుగా ‘ది బెస్ట్’ ఇవ్వడానికి చూసిన వెంకీని ట్రోల్ చేస్తున్నారు.
This post was last modified on July 20, 2021 5:05 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…