ఓవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకోబోతుంటే.. అంతకంటే ముందు విక్టరీ వెంకటేష్ నటించిన ‘నారప్ప’ లాంటి పెద్ద సినిమా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి అమేజాన్ ప్రైమ్ ద్వారా నేరుగా డిజిటల్లో రిలీజైంది. ఐతే దీంతో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఓటీటీల్లో రిలీజవుతాయని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ.. నితిన్ సినిమా ‘మాస్ట్రో’ కూడా డిజిటల్ రిలీజ్‌కు డీల్ పూర్తయిందన్నది సమాచారం.
ఐతే చిత్ర బృందం మాత్రం ఆ విషయం చెప్పకుండా ప్రి రిలీజ్ ప్రమోషన్లు మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ పాట రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఒక ప్రమోషనల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.
‘మాస్ట్రో’ డిజిటల్ రిలీజ్ హక్కులను హాట్ స్టార్ సంస్థ సొంతం చేసుకుంది. నితిన్ సొంత నిర్మాణ సంస్థ ‘శ్రేష్ఠ్ మూవీస్’ నిర్మించిన ఈ చిత్రానికి రూ.30 కోట్ల పై మొత్తానికి డీల్ అయినట్లు తెలుస్తోంది. నితిన్‌కు మంచి లాభాలే వచ్చాయి ఈ చిత్రంతో. నితిన్ చివరి రెండు చిత్రాలు చెక్, రంగ్ దె నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే. ‘మాస్ట్రో’ థియేటర్లలో రిలీజ్ అయి అటు ఇటు అయితే అతడి కెరీర్ మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో మంచి లాభానికి డీల్ కుదరడంతో ఓకే చెప్పేశారు.
బాలీవుడ్ సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ ‘అంధాదున్’కు రీమేక్‌గా తెరకెక్కిన చిత్రమిది. నితిన్ ఇందులో జీవనాధారం కోసం అంధుడి వేషం వేసుకునే మ్యుజీషియన్‌గా కనిపించనున్నాడు. అతడి సరసన నభా నటేష్ నటించింది. ఒరిజినల్లో టబు చేసిన అత్యంత కీలకమైన పాత్రలో తమన్నా నటించింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ ‘మాస్ట్రో’ను రూపొందించాడు.
This post was last modified on July 20, 2021 10:35 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…