ఈ ఏడాది హిందీలో ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన చిత్రాల్లో అత్యధిక అంచనాలున్నది ‘తూఫాన్’ మీదే. ‘బాగ్ మిల్కా బాగ్’ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ చేసిన కాంబినేషన్లో ఈ చిత్రం తెరకెక్కింది. ఫర్హాన్ అక్తర్ హీరోగా రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా ఈ చిత్రాన్ని రూపొందించాడు. లెజెండరీ అథ్లెట్ మిల్కా సింగ్ జీవితాన్ని ఎంతో ఉద్వేగభరితంగా తెరకెక్కించి దాన్నో క్లాసిక్ లాగా నిలబెట్టాడు రాకేశ్. మిల్కా పాత్ర కోసం ఫర్హాన్ ట్రాన్స్‌ఫామ్ అయిన తీరు, ఆ పాత్రలో అతడి పెర్ఫామెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
ఈ ఇద్దరూ మళ్లీ ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఫిలిం చేయడానికి రెడీ కావడం, బాలీవుడ్లో మంచి సక్సెస్ రేట్ ఉన్న బాక్సింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కడంతో ‘తూఫాన్’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మేలోనే రిలీజ్ కావల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడి.. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమేజాన్ ప్రైమ్ ‘తూఫాన్’ను రిలీజ్ చేసింది.
ఐతే అంచనాలను అందుకోవడంలో ‘తూఫాన్’ ఏమాత్రం విజయవంతం కాలేదు. రాకేశ్ వీకెస్ట్ ఫిలిమ్స్‌లో ఒకటిగా దీన్ని చెబుతున్నారు. ఫర్హాన్ అక్తర్ పెర్ఫామెన్స్, అతడి కష్టానికి ప్రశంసలు దక్కుతున్నప్పటికీ రాకేశ్ పనితీరును అందరూ విమర్శిస్తున్నారు. సినిమా డెడ్ స్లో అని.. కథలో ఏమాత్రం కొత్తదనం లేదని అంటున్నారు. సల్మాన్ ఖాన్ సినిమా ‘సుల్తాన్’ సహా చాలా స్పోర్ట్స్ సినిమాల ఫార్ములాలో సినిమా వెళ్లిపోయిందని.. ప్రేక్షకులను ఎగ్జైట్ చేసే మూమెంట్సే లేవని.. ఎమోషన్లు పండలేదని అంటున్నారు.
ఫర్హాన్-మృణాల్ ఠాకూర్‌ల ప్రేమకథ అన్నింటికంటే పెద్ద బలహీనత అని అభిప్రాయపడుతున్నారు. స్పోర్ట్స్ డ్రామాల్లో ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడటం కీలకం. ఆ కనెక్షన్ ఇందులో కుదరలేదని.. దీంతో సినిమా ఎక్కడా ఎగ్జైట్ చేయలేకపోయిందని.. స్లో నరేషన్ వల్ల కూడా సినిమా దెబ్బ తిందని ఇటు క్రిటిక్స్, అటు ప్రేక్షకులు అంటున్నారు.
This post was last modified on %s = human-readable time difference 7:37 am
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…
ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో లోకేష్ కనకరాజ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అతడి వల్లే సినిమాటిక్ యూనివర్శ్…