టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి పార్టీలకు, పబ్ లకు వెళ్తూ.. ఎప్పటికప్పుడు మీడియా కంట పడుతుంటారు. దీంతో వీరి మధ్య ఎఫైర్ ఉందంటూ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాహుల్ టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అతియా, ఆమె సోదరుడు అహాన్ కూడా ఇంగ్లండ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల క్రికెటర్లకు తమతో పాటు తమ భాగస్వాములను తీసుకొచ్చే అనుమతిచ్చింది బీసీసీఐ సంస్థ. ఈ క్రమంలో రాహుల్ .. అతియాను తన పార్ట్నర్ గా పేర్కొంటూ పర్మిషన్ తీసుకున్నాడని టాక్. ఇదిలా ఉండగా.. అతియా శెట్టి తండ్రి ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తన కూతురు ఇంగ్లండ్ లో ఉందని చెప్పారు. అయితే ఆమె తన సోదరుడితో కలిసి వెళ్లిందని.. అక్కడే ఇద్దరూ హాలిడే ఎంజాయ్ చేస్తున్నారని చెప్పారు.
ఈ సందర్భంగా రాహుల్-అతియా శెట్టిల జంట గురించి సునీల్ శెట్టి కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్ వీరిని అంబాసిడర్లుగా నియమించుకుంది.. నిజానికి వాళ్లిద్దరి జంట ముచ్చటగా ఉంటుందని.. అందుకే యాడ్ అంత బాగా వచ్చిందని అన్నారు.
ఇక రిలేషన్ గురించి మాట్లాడుతూ.. ఈ సంగతి వాళ్లనే నేరుగా అడిగితే సరిపోతుందని నవ్వేశారు. సునీల్ శెట్టి మాటలను బట్టి కూతురిని ప్రేమ విషయంలో ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేదనిపిస్తుంది. ఇక అతియా శెట్టి-రాహుల్ కలిసి నటించిన ‘నుమి ప్యారిస్’ అనే గాగుల్స్ యాడ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
This post was last modified on July 16, 2021 3:16 pm
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…