శర్వానంద్ కెరీర్లో సక్సెస్ అయిన సినిమాల కంటే ఫెయిల్యూర్లే ఎక్కువ. కానీ అతను ఫలితాల గురించి పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు వైవిధ్యం కోసం ప్రయత్నిస్తుంటాడు. శర్వా ఫ్లాప్ సినిమాల్లోనూ చాలా క్లాసిక్స్ ఉండటం విశేషం. ఇటీవలే ‘శ్రీకారం’ లాంటి మంచి సినిమాతో అతను ప్రేక్షకులను పలకరించాడు. కానీ వివిధ కారణాల వల్ల ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. కానీ శర్వా గర్వంగా చెప్పుకునే చిత్రాల్లో అదొకడనడంలో సందేహం లేదు. దీని తర్వాత ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతితో ‘మహాసముద్రం’ అనే సినిమాను పూర్తి చేశాడు ఇందులో సిద్దార్థ్ మరో హీరోగా నటించాడు.
ఐతే ‘మహాసముద్రం’ పట్టాలెక్కడానికి ముందే శర్వా.. తమిళ, తెలుగు భాషల్లో ఓ చిత్రాన్ని మొదలుపెట్టాడు. అదే.. ఒకే ఒక జీవితం. తమిళంలో పేరున్న బేనర్ అయిన డ్రీమ్ వారియర్స్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. శ్రీ కార్తీక్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు.
ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టరే ‘ఒకే ఒక జీవితం’ చాలా స్పెషల్ మూవీ అనే సంకేతాలు ఇచ్చింది. తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్లో ఒక వైపు 90ల నాటి వస్తువులు.. మరోవైపు ప్రస్తుత కాలానికి సంబంధించి అధునాతనమైన వస్తువులు చూపించడం ద్వారా ఇదొక వ్యక్తి జీవిత పరిణామ క్రమాన్ని చూపించే సినిమా అని అర్థమైంది. ఇప్పుడు మోషన్ పోస్టర్ సైతం అలాంటి సంకేతాలే ఇచ్చింది.
ఒక వ్యక్తి టీనేజీ నుంచి 30 ప్లస్ వరకు జీవిత క్రమాన్ని చూపిస్తున్నట్లుగా సైన్స్ ఫిక్షన్ స్టయిల్లో మోషణ్ పోస్టర్‌ను తీర్చిదిద్దారు. ముందుగా టేప్ రికార్డతో మొదలుపెట్టి.. తర్వాత కాలంలో మార్పులకు అనుగుణంగా వస్తువులను చూపిస్తూ స్టన్నింగ్ విజువల్స్‌తో మోషన్ పోస్టర్‌ను నడిపించారు. హీరో ఇందులో ఒక మ్యుజీషియన్ అనే విషయం అర్థమైంది. మోషన్ పోస్టర్లో ప్రతి అంశం ఆకట్టుకునేలా ఉంది. ‘గమ్యం’ తరహాలో శర్వా కెరీర్లో ఒక క్లాసిక్ లాగా ఆ చిత్రం నిలిచిపోతుందనే సంకేతాలు అందుతున్నాయి. మరి ఆ అంచనాలను సినిమా ఏమేర అందుకుంటుందో చూడాలి.
This post was last modified on July 16, 2021 6:51 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…