స్పోర్ట్స్ బయోపిక్.. గత దశాబ్ద కాలంలో బాలీవుడ్లో బాగా డిమాండ్ పెరిగిన జానర్. బాగ్ మిల్కా బాగ్, ఎం.ఎస్.ధోనిః ది అన్ టోల్డ్ స్టోరీ లాంటి చిత్రాలు ఘనవిజయం సాధించడంతో క్రీడాకారుల జీవితాల ఆధారంగా వరుసబెట్టి బయోపిక్స్ తీసేస్తున్నారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ మీద కూడా సచిన్ః ఎ బిలియన్ డ్రీమ్స్ అనే డాక్యుమెంటరీ టైపు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక క్రికెటర్లలో అందరూ చూడాలనుకునే బయోపిక్స్‌లో సౌరభ్ గంగూలీది కచ్చితంగా ఉంటుందనడంలో సందేహం లేదు. దాదా అభిమానులు అతడి సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ దిశగా అడుగు పడింది. తన బయోపిక్ రాబోతున్నట్లు స్వయంగా గంగూలీనే వెల్లడించడం విశేషం.
తన బయోపిక్‌కు అంగీకారం తెలిపానని.. దీని గురించి చాలా రోజులుగా చర్చలు జరుగతున్నాయని.. త్వరలోనే ఈ సినిమా మొదలవుతుందని.. దీని దర్శకుడు, ఇతర వివరాలు తర్వాత వెల్లడవుతాయని గంగూలీ చెప్పాడు. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్‌తో గంగూలీ బయోపిక్ తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని.. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ దాదా పాత్రలో నటిస్తాడని బాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
2000లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంతో భారత క్రికెట్ కుదేలైన స్థితిలో జట్టు పగ్గాలు చేపట్టి.. దేశ క్రికెట్ ముఖచిత్రాన్నే మార్చేసిన ఘనత గంగూలీదే. అప్పటిదాకా భయం భయంగా ఆడే భారత జట్టులో ధైర్యాన్ని నింపి.. దీటుగా ప్రత్యర్థులను ఎదుర్కొనేలా చేసి.. విదేశాల్లో అద్భుత విజయాలు అందించిన చరిత్ర దాదాది. తనదైన దూకుడుతో కెప్టెన్సీకి కొత్త అర్థం చెప్పి కోట్లాది అభిమానుల మనసులు గెలిచాడు. వ్యక్తిగత జీవితంలోనూ విశేషాలకు లోటు లేని దాదా మీద సినిమా సరిగ్గా తీస్తే అది బ్లాక్‌బస్టర్ కావడం ఖాయం.
This post was last modified on July 14, 2021 9:50 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…