టాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది తమిళ నటులు గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లో నటించేస్తున్నారు. దీంతో మన హీరోలు కూడా తెలుగు, తమిళ బైలింగ్యువల్ అని.. పాన్ ఇండియా సినిమాలంటూ హడావిడి మొదలుపెట్టారు. హీరో రామ్ కూడా రీసెంట్ గా ఓ బైలింగ్యువల్ కథను అంగీకరించారు. దర్శకుడు లింగుస్వామి రూపొందించనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.
రామ్ తొలిసారిగా ఈ సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుండడంతో ముందుగానే విలన్ గా తమిళ హీరోని తీసుకోవాలని భావించారు. ఆ లిస్ట్ లో చాలా మంది పేర్లను పరిశీలించారు. ఫైనల్ గా హీరో ఆర్యను తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఆర్యకు తెలుగునాట మంచి పేరే ఉంది. గతంలో ‘వరుడు’ సినిమాలో విలన్ గా కనిపించారు. అలానే ఆయన నటించిన తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. ఆ విధంగా ఆర్య తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
ఇప్పుడు రామ్ సినిమాలో విలన్ గా దాదాపుగా ఆర్యనే తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రామ్ పాత్రకు ధీటుగా ఆర్య పాత్ర ఉంటుందట. ఆర్య సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ప్రకటన వస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తారని చెబుతున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
This post was last modified on July 13, 2021 7:13 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…