టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది పూజాహెగ్డే. ఆమె చేతిలో క్రేజీ ప్రాజెక్ట్ లు ఎన్నో ఉన్నాయి. బాలీవుడ్ లో కూడా రణవీర్ సింగ్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు ఒప్పుకుంది. అవకాశాల కోసం అందరిలా ఆమె హాట్ ఫోటోషూట్లు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకో ఈ బుట్టబొమ్మ ఇప్పుడు తన హాట్ నెస్ తో అదరగొడుతుంది. వరుస ఫోటోలు షేర్ చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
గత రెండు వారాలుగా ఆమె గ్యాప్ లేకుండా ఫోటోషూట్స్ తో ఇన్స్టాగ్రామ్ ను హీటెక్కిస్తోంది. ఇప్పటికే ఆమెకి ఇన్స్టాగ్రామ్ లో 14 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. రోజురోజుకి ఆ నెంబర్ పెరిగిపోతుంది. ఒక్కో కమర్షియల్ పోస్ట్ కి లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటూ బాగా సంపాదిస్తోంది. ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఫాలోవర్లు ఉంటే సెలబ్రిటీలకు అంత ఆదాయం. బహుశా అందుకేనేమో పూజాహెగ్డే తన ఫాలోవర్లను పెంచుకునే పనిలో పడింది.
వరుస ఫోటోషూట్లలో పాల్గొంటూ వాటిని తన సోషల్ మీద అకౌంట్స్ లో షేర్ చేస్తుంది. తాజాగా అమ్మడు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని ఓ ఫోటోషూట్ లో పాల్గొంది. ఇందులో పూజా అందాలను చూడడానికి రెండు కళ్లు సరిపోవేమో అన్నట్లుగా ఉంది. ఈ ఫోటోపై నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఫోటోకి మిలియన్ కి మించి లైక్స్ వచ్చాయి.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోపక్క ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’ వంటి సినిమాల్లో నటిస్తోంది. అలానే విజయ్ సరసన ‘బీస్ట్’ అనే సినిమాలో నటిస్తోంది.
This post was last modified on July 12, 2021 10:05 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…