పోయినేడాది కరోనా టైంలో నెలల తరబడి థియేటర్లు మూతపడ్డాయి. ఎప్పటికి అవి తెరుచుకుంటాయో తెలియని సందిగ్ధతలో కొందరు నిర్మాతలు తమ చిత్రాలను ఓటీటీల్లో రిలీజ్ చేసేశారు. ఎగ్జిబిటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ తగ్గలేదు. వేరే ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగులో ఓటీటీ బాట పట్టిన చిత్రాలే కానీ.. చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు ఆ మార్గంలో రిలీజయ్యాయి.
వి, నిశ్శబ్దం లాంటి పెద్ద సినిమాలు ఓటీటీలో రిలీజ్ కావడం తెలిసిందే. ఒక దశలో ఎగ్జిబిటర్లు కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకున్నట్లే కనిపించారు. ఓటీటీల్లో రిలీజయ్యే చిత్రాల పట్ల మరీ అంత వ్యతిరేకత ఏమీ ప్రదర్శించలేదు.
కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా మాత్రం ఎగ్జిబిటర్ల స్పందన మరోలా ఉంది. ఇప్పటికే థియేటర్ ఇండస్ట్రీ బాగా దెబ్బ తినేసిన నేపథ్యంలో నిర్మాతలు మంచి అంచనాలున్న సినిమాలను ఓటీటీలకు ఇచ్చేసి వెండితెరలకు అన్యాయం చేస్తున్నారంటూ వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఈసారి తాడో పేడో తేల్చుకోవడమే అన్నట్లు ఎగ్జిబిటర్లు నిర్మాతలతో పోరాటానికి సై అనేశారు. నిర్మాతలు దారికి రాకుంటే థియేటర్లు మూసేసి వాటిని వేరే రకంగా ఉపయోగించుకోవడానికి కూడా వెనుకాడబోమని నిర్మాతలకు తేల్చి చెప్పేసినట్లు కనిపిస్తోంది. అలాగే ఇప్పుడు దారికి రాకుంటే రేప్పొద్దున సాధారణ పరిస్థితుల్లో థియేటర్ల కోసం విపరీతమైన పోటీ నెలకొన్న సమయంలో బదులు తీర్చుకుంటామని కూడా ఎగ్జిబిటర్ల నుంచి నిర్మాతలకు హెచ్చరికలు అందినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే కొత్తగా ఓటీటీ డీల్స్ చేసుకోవాలనుకుంటున్న వాళ్లే కాదు.. ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న వాళ్లు కూడా వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాత ‘నారప్ప’ ఓటీటీ రిలీజ్ విషయంలో వెనుకంజ వేసినట్లు చెబుతున్నారు. ఇప్పుడు నితిన్ ‘మాస్ట్రో’ విషయంలోనూ ఇదే జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. చూస్తుంటే పేరున్న సినిమాలేవీ కూడా ఓటీటీల్లో వచ్చే అవకాశాలే కనిపించడం లేదు. మొత్తానికి ఎగ్జిబిటర్లు ఈసారి గట్టిగా నిలబడి నిర్మాతలను బాగానే భయపెట్టినట్లున్నారు.
This post was last modified on July 11, 2021 3:38 pm
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి మళ్ళీ ఇంకో సినిమా రాలేదు. గ్యాప్…
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…
సీఎం చంద్రబాబు .. రాజధాని అమరావతికి బ్రాండ్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగలరని…